Friday, March 14, 2008

రాబోయే ఎన్నికలలొ ఇడుపులపాయ బాట పట్టించటానికి ప్రజలు ఎప్పుడో సిద్ధమై పోయారు..

తెలుగువాడి పన్నులతో సమకూరిన నిధులతో కట్టిన విమానాశ్రయానికి తెలుగువాడైన అంజయ్యని కించపరచిన రాజీవ్ పేరా?(ఇప్పటికీ ప్రజలకి రాజీవ్ అంటే "భొఫోర్స్" అనే గుర్తుకొస్తుంది ).....నవ్వి పొదురు గాక నాకేటి సిగ్గు చందంగా ఉన్న ఈ భగవంతుడి పాలన సగటు తెలుగుపౌరుడి కి వెగటు పుట్టిస్తుంది. ఎందరో త్యాగధనులున్న తెలుగు నేల మనది.....జీవిత కాలం రాజకీయవిలువలతో బ్రతికి అవినీతి కార్యక్రమాలకి దూరం గా నిరంతరం ప్రజల మనుషులు గా మన్నన లను పొంది తెలుగు జాతి ఔన్నత్యాన్ని గౌరవాన్ని పెంచి తనువు చాలించిన తెలుగు రాజకీయ రత్నాలు మనకెన్నో ఉన్నాయి.... ఒక పింగళి వెంకయ్య (ఎర్రకోటపై గర్వం గా ఎగిరే త్రివర్ణ పతాక రూపకర్త....మరి ఈయన ఇప్పుడు ఎంతమందికి గుర్తున్నాడు)ఒక రావి నారాయణ రావు (తెలంగాణా పోరు బిడ్డ) ...ఒక సురవరం ప్రతాపరెడ్డి..రాణీ రుద్రమ....త్రిపురనేని రామస్వామి చౌధరి..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి......అల్లూరి...పుచ్చలపల్లి...టంగుటూరి...కందుకూరి.....నందమూరి తారక రాముడు....పాములపర్తి నరశింహుడుఇలా ఈ చిట్టా పెరిగిపొతూంది...వీళ్ళెవరూ పనికి రాక పోవటానికి కారణం అందరికీ తేటతెల్లమే....తెల్ల దొరసాని మెప్పు కోసం, తమ కుర్చీ కాపాడుకోవటనికి తెలుగుప్రజల తో ముడిపడి ఉన్న తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు.... ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేకపోవటానికి కారణం మన మధ్య అయిక్యథ లేకపొవటమే.... అసలు ఆ మాటకొస్తే దేశంలొ ఏ విమానాశ్రయానికి కూడ స్తానికేతరుల పేర్లు లేవు...ముంబై - చథ్రపథి శివాజి పేరు,కొల్కొత - నేతాజి పేరు,చెన్నై - అన్నదురై పేరు,ఆహ్మదబద్-పటెల్ పేరు,భువనెశ్వర్ - బిజు,నాగ్పూర్ - అంబేద్కర్ పేరు,ఇండోర్ - అహల్యా భాయి పేరు,గౌహతి-గోపీనాథ్ పేరు...ఇలా అందరూ స్థానికులే....మనమీదే ఇలా పేర్లు రుద్దబడుతున్నాయి. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతొ వారి పాలనకి వారే మరణశాసనం రాసుకుంటున్నారు.....చరిత్ర లో హిట్లర్, నీరో లాంటి నియంతలే ప్రజాగ్రహానికి మాడి మసై కాలగర్భంలో కలిసిపోయారు ......నా కోప నరం ఎప్పుడో తెగిపోయిందని రోజూ ఆగ్రహంగా అస్సెంబ్లీ లో ఊగిపోతూ చెప్పే ఈ పిల్ల నియంతను రాబోయే ఎన్నికలలొ ఇడుపులపాయ బాట పట్టించటానికి ప్రజలు ఎప్పుడో సిద్ధమై పోయారు.. కాకపోతే అవినీతి కూపం లొ కూరుకు పోయిన ఈ గుడ్డి ప్రభుత్వం ఆ విషయం గ్రహించే స్పౄహ లో లేదంతే.