Friday, November 05, 2010

Sunday, October 31, 2010

ఇటీవల రాష్త్రం లో జరిగిన రెండు సంఘటనలు...

ఇటీవల రాష్త్రం లో జరిగిన రెండు సంఘటనలు...
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ దగ్దం: ఈ సంఘటన మాత్రం నా మనసుని తీవ్రం గా కలచి వేసింది....నాకు తెలిసి, ఆయన కేవలం మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రమే కోరి ఆ దిశగా ధ్రుఢ చిత్తం తో, అహింసా పద్దతి లో పోరాడి తన ప్రాణాలనే పణంగా పెట్టి దాన్ని సాధించాడు[1953 లో].మరి ఆ తరువాత 3 ఏళ్ళకి 1956 లో ఏర్పడిన సమైఖ్య రాష్ట్రావతరణకు ఆయనికి ఏమిటి సంబంధం? ఆయన ఉద్యమ స్ఫూర్తి ని ఆదర్శంగా తీసుకోవల్సింది పోయి అమరజీవి విగ్రహాన్నే తగులపెట్టిన దుండగులకీ మరియూ తాలిబాన్ లో బుద్దుడి విగ్రహాలని కూల్చిన ఉగ్రవాదులకి మధ్య నాకు ఆట్టే తేడా కనపడటం లేదు....అసలు ఇలాంటి దుశ్చర్యల కారణంగానే వారు కోరుకునే ప్రత్యేక రాష్ట్రం ఆలస్యం అవుతుందనే విషయం తెలుసుకోలేక పోతున్నారు...మన రాష్ట్రంలో కొలువు తీరిన మూగ గుడ్డీ చెవిటి నపుంసక ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు....ఇక ప్రతిపక్షం అంటారా....దాని స్థితి మరింత ఆగమ్యగోచరంగా తయారయ్యింది....
తెలుగు కి త్రుటిలో తప్పిన అవమానం:మరో సంఘటన, టి సుబ్బరామి రెడ్డి అనబడే ప్రచార పిశాచి కి తన పదవీ దాహం లోనించి ఒక ఆలోచని పుట్టింది...అదేమిటంటే, "హైదరబాదు నగర నడి బొడ్డున నెలకొని రాష్ట్రం లోనే మొట్టమొదటి ఓపెన్ థియేటర్ గా ఖ్యతి నార్జించిన "తెలుగు లలిత కళా తోరణం" [నేను నర్తనశాల సినిమా ఇక్కడే చూసాను ] కి రాజీవ్ గాంధీ కళా తోరణం పేరు పెట్టి ఇటలీ అమ్మను ప్రసన్నం చేసుకుని మంత్రి పదవి కొట్టేయటం". ఇదీ వారి ఆలోచన...ఆలోచన రావటమే తరువాయి, రాష్ట్రం లో ఉన్న దిష్టి బొమ్మ ప్రభుత్వాన్ని బైపాస్ చేసి డిల్లీ నించి అనుమతి తెచ్చుకోవటమూ, దానికి 3 జీ ఓ లు జారీ కావటమూ చక చకా జరిగిపోయాయి...విషయం బయటకు తెలవగానే మీడియా లో ప్రజలు, ప్రజా సంఘాలు మరియూ వివిధ రాజకీయ పార్టీలు తీవ్రం గా వ్యతిరేకించటం తో పాటు తెలుగు దేశం పార్టీ పబ్లిక్ గార్డెన్స్ లో చేపట్టిన నిరసన కార్యక్రమం తో తనకు తానుగా "కళా బంధు" అని అభివర్ణించు కొనే సదరు పిశాచి దిగి వచ్చి తన ప్రణాలిక ను ఉపసం హరించుకోవటం తో తెలుగు భాషాభిమానులందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.....తెలుగు వారి అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు విషయంలో కూడా ఇదే ఐఖ్యతా పోరాట పటిమ కావాలి....ఆ దిశగా ఉద్యమించి విమానాశ్రయానికి మన తెలుగువారి పేరు పెట్టించుకోవాలి.......తెలుగువారికి అంతర్జాతి ఖ్యాతి నార్జించి పెట్టిన పెద్దాయన ఎన్ టీ ఆర్ కు అదే నిజమైన నివాళి అవుతుంది.....

Friday, October 22, 2010

రక్త చరిత్ర !!

రక్త చరిత్ర సినిమా - నాణేనికి ఒకవైపు:
సినిమాను ప్రకటించినప్పటి నుంచీ వార్తలలో ఉంటూ వస్తూన్న "రక్త చరిత్ర-1" సినిమా ఓబులరెడ్డి వర్గాల బెదిరింపులను, స్వచ్చంద సంస్థల హెచ్చరికలను మరియూ సెన్సారు అవరోధాలను కూడా దాటుకుని ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది.సినిమా లో పెద్దాయన ఎన్ టీ ఆర్ ని పోలిన ముఖ్యమంత్రి పాత్ర ని చిత్రీకరించిన విధానం ఆయన ను ఆరాధ్యదైవం గా భావించే అశేష అభిమాన జన మనోభావాలను గాయపరిచేవిధంగా ఉంది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.....ఆ విమర్శల ధాటికి, క్షమాపణ అనే పదానికి నా నిఘంటువు లో చోటు లేదు అని తరచూ ప్రకటించుకునే వర్మ మీడియా ముందుకొచ్చి క్షమాపణ లు చెప్పి "అభ్యంతరకర సన్నివేశాలు గా భావిస్తున్న వాటిని తొలగిస్తున్నాను అని ప్రజలకి మాటివ్వటం జరిగింది".
నాకు కూడా సినిమా చూస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి పాత్ర కథానాయకుడు కి అండగా నిలబడినందున అంతగా అనిపించలేదు కాని , థియేటర్ నుంచి ఇంటికొచ్చిన తరువాత విశాల ధ్రుక్పథం తో ఆలోచించినపుడు, "అవునూ, పెద్దాయన "అహం ! బ్రహ్మాస్మి" టైపు అనే తెలుసు గాని ఏనాడూ కక్షలు కార్పణ్యాలకు కొమ్ము కాసినట్లు గా లేదా ప్రోత్సహించినట్లు గా ఎప్పుడూ చదవలేదు వినలేదు కదా... ఇలా చూపించారేంటి" అని అనిపించింది.
మరో విషయం ఎమిటంటే, రాయలసీమలో ని అనంతపురం నేపధ్యం ఉన్న ఈ యదార్థ గాథ లో అదే నేపధ్యం కొరవడింది....మీకు సినిమాలో ఎక్కడా రాయలసీమ లేక తెలుగు వారి నేపధ్యం కనపడదు....కాని టీవి9 లాంటి మీడియా మైకులు మాత్రం కనపడతాయి....మరి 82 లెదా 83 లో ఎలెక్ట్రోనిక్ [ఉదా:టీవి9..] మీడియా ఎక్కడుందో సినిమా చూసే ప్రేక్షకుడికి బోధపడదు....సినిమా అంతా సాగే వాయిస్ ఓవర్ ని వర్మ కాకుండా రవిప్రకాష్ లాటి డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించి ఉంటే బావుండేదనిపించింది.
పరిటాల రవి హైదరాబాదు గూడాలని ఇంటికి ఆహ్వానించి రాగి సంకటి కోడికూరలతో భోజనం పెట్టించి గూండాగిరీలు భూకబ్జాలు ఇకపై నగరం లో ఎక్కడా జరగ కూడదని హెచ్చరించటం తో ముగించి మిగతా నవంబర్ 19న విడుదల కాబోయే "రక్త చరిత్ర-2" లో చూసుకోమన్నారు....తమిళ నటుడు సూర్యా కూడా రెండవ భాగం లోనే మద్దెలచెరువు సూరి గా రాబోతున్నాడు....ఇది కచ్చితంగా మహిళలు పిల్లలు చూడ తగిన సినిమా కాదు అని ప్రేక్షక లోకం మరియూ మీడియా కూడా కోడైకూస్తోంది....
రక్త చరిత్ర సినిమా - నాణేనికి మరో వైపు:
సాంకేతికంగా చూస్తే , ఉత్కంఠభరితమైన కథనానికి [స్క్రీన్ ప్లే] పర్యాయ పదం వర్మ....పెద్దగా మలుపులు లేని ఇలాంటి కథని తీసుకుని [ప్రేక్షకులు వెకిలి హాస్యానికి పంచ్ డైలాగులకీ అలవాటుపడిపోయిన ఈ రోజుల్లో] తెరపై ఆవిష్కరించిన విధానం [హింస ని మరియూ బుక్కారెడ్డి శ్రుంగార సన్నివేశాలని మినహాయించి] ప్రేక్షకులని మంత్రముగ్దులని చేసి కుర్చీలకి కట్టి పడేస్తుంది....
**** సశేషం ! ****

Thursday, October 07, 2010

ఖలేజా!

దాదాపు 3 సం తరువాత మహేష్ బాబు ఖలేజా సినిమాతొ ప్రేక్షకులని పలకరించాడు....మొదటి రోజు మొదటి ఆట కి కుటుంబ మిత్ర సమేతంగా వెళ్ళి చూసాము....దాని గురించి కొన్ని విషయాలు...
సినిమాలో ఆకట్టుకున్నది ఒకే ఒక్కటి: అది మహేష్ బాబు సరికొత్త నటన...I dont call him as Indian David Curaso from CSI:Miami any more.
అంతుబట్టని విషయాలు:
1. 3 ఏళ్ళ సమయం తీసుకుని 50 కోట్లు ఖర్చుపెట్టీ తీసిన సినిమాలో తెర మీద కనపడేది మాత్రం అంతా మట్టే! ఆ డబ్బంతా వేటికి ఖర్చు చేసినట్టూ?
2.దేవుడు అంటున్నారని కాకపోయినా, తనకు ప్రాణ దానం చేసిన క్రుతఙ్నత తో నైనా సిద్దప్ప [షఫి] మనుషుల తరుపున పోరాడవచ్చు కదా! ఎందుకు పారిపోయినట్లు ?
3.సినిమా అంతా ఏదో చీకటి గుహ లో తీసినట్టు ఎందుకుంది?
4.ఒక్క పాటలో కూడా మంచి కోరియోగ్రఫి ఎందుకు ఇవ్వలేక పోయారు?
5."గట్టి ప్రత్యర్థి తొ తలపడినప్పుడే కథానాయకుడి వీరత్వం లోకానికి తెలిసేది " అన్న ప్రాథమిక సూత్రాన్ని ఎందుకు మరచారు?
దర్శక నిర్మాతల్లారా ! వీటికి సమాధానం తెలిసీ చెప్పక పోయారో మహేష్ మిమ్మల్ని పద్మాలయా చాయల క్కూడా రానివ్వడు.

Thursday, September 16, 2010

పడమటి సంధ్యారాగం హీరో ఇప్పుడు ఎమి చేస్తున్నాడు?

1986 లో విడుదలై విజయం సాధించిన తెలుగు చిత్రం "పడమటి సంధ్యారాగం" సినిమా లో "సాంధ్య! నేను.. అందంగా..చచ్చానా?" అని వచ్చీ రాని తెలుగులో మాట్లాడి మన అందరినీ అలరించిన హీరో టాం [అసలు పేరు తామస్ జేన్ ఈలియట్ లెండి] గుర్తున్నాడు కదా! సినిమా విజయం సాధించినా అతని గురించి తెలుగు పత్రికలోనూ ప్రచురించినట్లు గాని చదివినట్లు గాని నా వరకూ తెలియదు... మధ్య నే సినిమా మరో సారి చూస్తున్నప్పుడు ఇతని గురించి మనమే కొన్ని విషయాలు తెలుసుకుని బ్లాగితే ఎల వుంటుందా అనే అయిడియా వచ్చింది.. ఆలోచనకి ప్రతిరూపమే వ్యాసం.
మైకెల్ మరియూ సింతియా దంపతులకు జనవరి 19, 1969 లో బాల్టిమోర్ నగరం, మేరిలాండ్ రాష్ట్రం లో జన్మించిన టాం వారి ఆరుగురు పిల్లలలో ఒకడిగా పెరిగాడు.1986 లో పడమటి సంధ్యారాగం ప్రొడ్యూసర్స్ పరిచయం కావటం తొ అతని 17 ఏళ్ళ వయసులో "తామస్ స్ప్రిగ్ వుటన్",మేరిలాండ్ హై స్కూల్ వదిలేసి అమెరికా రోమియో & తెలుగు జూలియట్ కథ తో తయారైన "పడమటి సంధ్యారాగం" సినిమా లో నటించటానికి ఒప్పుకోవటం జరిగింది. సినిమా ప్రజాదరణ పొందటం తొ మంచి భవిష్యత్ కనపడుతున్నా, సొంత గడ్డ పై ఉన్న మమకారం తో, లాస్ ఏంజిలెస్ వెళ్ళిపోయి తిరిగి తన నటనకు మెరుగులు దిద్దుకోసాగాడు.
ప్రస్థానం లో ఎన్నో ఒడిదుకులు కూడా ఎదుర్కున్నాడు..డబ్బులు కోసం వీధి నాటకాలు వేస్తూ, పార్కుల్లోని బెంచీల పై నిద్రిస్తూ ఎన్నో రాత్రులు గడిపాడు.ఒక దశ లో గ్రుహ వసతి లేని వారి చిట్టా లో కూడా నమోదు చేసుకోవలసి వచ్చింది.సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ ఇలాంటి వారికి ఆహారం సమకూరుస్తుంది.అలా వారు సమకూర్చిన ఆహారం తో బ్రతుకు వెళ్ళబుచ్చుతూ అవకాశాల వేట మాత్రం ఆపలేదు.నెమ్మదిగా చిన్న చిన్న కంపెనీల నుంచి చిన్న చితకా అవకాశాలు రావటం మొదలైంది.క్రమేపీ వాణిజ్య ప్రకటనలు లో అవకాశాలు రావటం , వాటిలొ నటిస్తూండగానే 1992 లో "బఫ్ఫి వాంపైర్" లొ ఒక చిన్న పాత్ర లభించింది.దీని తరువాత "నెమెసిస్"(1993)అనే మాస్ మసాల చిత్రం లో చేసాడు.1996 లో వచ్చిన "గ్రౌండ్ జీరో" అనే సినిమాలో అతని భవిష్య భార్యామణి ఐషా హౌర్ తొ కలిసి నటించాడు [ప్రస్తుత భార్య పెట్రిషియా అనుకోండి, కానీ ఇది కూడ విడాకులకు దారి తీస్తుందని విన్నాను].
ఇన్ని చేసినా 1997 లో వచ్చిన "ఫేస్ ఆఫ్" మాత్రమే అతని ఫేస్ వాల్యూని కొంచం పెంచింది..ఇందులో నికొలస్ కేజ్ తో నటించే అవకాశం కూడా వచ్చింది అతనికి.పూర్తిస్తాయి హీరో అవకాశం వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమా మాత్రం "డీప్ బ్లూ సీ" (1999). సినిమా అత్యంత ప్రజాదరణ పొంది అతనికి మంచి గుర్తింపు తెచ్చినా చాలా కాలం అతిధి పాత్రలు సహాయక పాత్రలతో సరిపెట్టుకోవలసి వచ్చింది...
వెండి తెరపై అంతగా రాణించక పోయినా బుల్లి తెర బాగానే కరుణించినట్లుంది....2009 లో హెచ్ బి చానల్ "హంగ్" అని ఒక ఆంగ్ల ధారావాహిక కోసం టాం ని బుక్ చేసుకుని ప్రసారం చేయటం జరిగింది....అమెరికా లో '' రేటెడ్ టీవి ఫ్లిక్ కు వచ్చినంత ప్రజాదరణ మరి దేనికీ రాలేదు...టాం కి హాట్ హీరో క్రేజ్ తొ పాటు హెచ్ బి చానల్ కి టి ఆర్ పి రేటింగ్స్ మరియూ సబ్ స్క్రిప్షన్స్ అమాంతం పెరిగి పోయాయట.బహుశా ఇక మన క్రిస్ [తెలుగు సినిమాలో అతని పేరు] అదేనండీ టాం బుల్లి తెరకే పరిమితమైనా అయిపోవచ్చు...ఏది ఏమైనా ఎంతటి ఒడుదుడుకులకు లోనైనా ఆత్మస్తైర్యం కోల్పోకుండా తానెంచుకున్న రంగంలోనె ద్రుఢ చిత్తం తో వెండి తెరా బుల్లి తెరా అని చూసుకోకుండా ముందుకు సాగుతున్న ఇతని కథ స్పూర్తిదాయకం అనిపిస్తూంది కదూ!! ప్రతి రంగం లో ఇలా కష్టాలు పడి పైకొచ్చిన వారున్నా, హాలివుడ్డా లేక బాలివుడ్డా, మాలివుడ్డా లేక టోలివుడ్డా అని తేడా లేకుండా సినీ రంగం లో సంఖ్య కాస్త ఎక్కువే అని చెప్పాలి.
ఒక సందర్బం లో ఇండియన్స్ గురించి ఇలా వ్యాఖ్యానించాడు:

"I still have a real soft spot for everything Indian. India opened up my eyes to the world in a way no other experience could have. It’s the opposite of the western world. Their values are put less on the material things and more on the spiritual things of life. Being in India gave me a perspective that material things are not the end-all, be-all of what life is about… I was shown the light in India… It gave me the strength and wisdom to overcome a lot of rejection""