Saturday, July 10, 2010

FIFA 2010 Finals : ఆక్టొపస్ Vs చిలక ?

ఇప్పటికే స్పెయిన్ గెలుస్తుంది అని జ్యోస్యం చెప్పిన పాల్ అని పిలవబడే ఓ ఆక్టొపస్ కు, కాదు కాదు ఫీఫా 2010 ఫైనల్ లో గెలిచేది నెదర్లాండ్సే అని సవాల్ విసురుతూ బుల్లితెర పైకి వచ్చింది సింగపూర్ లో మణి గా ప్రాచుర్యం పొందిన ఓ చిలక...జ్యోస్యం అంటూ చెపితే అది నేనే చెప్పాలి ! అది నా జన్మ హక్కు అనుకుందో ఏమో!మరి.

యెంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్లు వీటి జ్యోస్యం ఆయా జట్ల ఆటగాళ్ళ ఆత్మవిశ్వాసానికొచ్చింది కదూ?

పాల్ జ్యోస్యం ప్రకారం స్పెయిన్ దే విజయం...
మణి జ్యోస్యం ప్రకారం నెదెర్లాండ్స్ గెలుస్తుందట....

Friday, July 09, 2010

ఫ్రీమేకు పాటలు!!

సినిమా పరిశ్రమలో ముఖ్యంగా మేకులు[డైరెక్ట్] మరియు రీమేకులు అని రెండు రకాలనుకుంటే అనధికారికంగా ఫ్రీమేకు అని మరోకటి ఉంది.మన దేశీ సినిమా సంగీత దర్శకులు విదేశీ సంగీతాన్ని అప్పుడప్పుడు ఫ్రీమేక్ చేస్తూ పాటలు సమకూరుస్తారు అన్న విషయం మన అందరికీ తెలిసిందే….అవి కూడ సూపర్ హిట్స్ అవుతుండటం మనం వింటూనే వున్నాం……అలా దిగుమతైన ఒక పాట గురించి నా శ్రీమతి ఈమధ్య నా దగ్గర ప్రస్థావించడం జరిగింది……ఆ పాట పోకిరి చిత్రం కోసం మణిశర్మ సంగీతం సమకూర్చిన 'గల గల పారుతున్న గోదారిలా.'….కాకతాళీయమో లేక కావాలనే చేసారో గాని ,1974 లో సూపర్ స్టార్ క్రిష్ణ నటించిన 'గౌరి ' చిత్రం లోని అదే 'గల గల…' పాటకి ఇది రీమిక్స్ అట…..మరి గౌరి చిత్రం లోని పాట దేనికి రీమిక్సో తెలుసుకోవాలనుందా?…అందుకోసం మీరు అప్పటికి 35 ఏళ్ళు వెనక్కు వెళ్ళాలి మరి.…..అంటే 1939 లొ హోసే ఫెలిషియానో అనబడే ఆంగ్ల గాయకుడు పాడగా విడుదలైన ఒక ఆంగ్ల నర్సరీ గీతానికి మహా నకలు అనితెలిసింది….…ఇక్కడ క్లిక్ చేసి మీరూ వినవచ్చు.
అలాగే, జగపతిబాబు ప్రియమణి జంటగా నటించగా ఈ మధ్య విడుదలైన ప్రవరాఖ్యుడు సినిమా కోసం కీరవాణి కూడ అమెరికన్ గాయకుడు జస్టిన్ టింబర్లేక్ ఆల్బం నుంచి ఒక పాట ని ఇలాగే ఫ్రీమేకు చేసుకున్నట్లు తెలిసింది...ఆ పాటని టీవీ9 పరిశోధించి ప్రసారం చేయగా యూట్యూబ్ లో కూడ పెట్టారు...దానికోసం ఇక్కడ చ్లిక్ చేయండి.

Thursday, July 08, 2010

ఆక్టొపస్ జ్యోస్యం!!

ఆక్టొపస్ జ్యోస్యం!!
ఫీఫా 2010 లో అర్జెంటీనా తలరాత ను ఒక ఆక్టొపస్ రాసిందా? అవుననే అంటున్నారు కొంతమంది అర్జెంటీనా అబిమానులు…..అంతేకాదు… అర్జెంటీన 0-4 స్కోరు తో జర్మనీ పై ఓడిపోవటానికి కారణం ఈ ఆక్టొపస్ జ్యోసమే కారణం అని దాని అభిమానులు కొందరు నమ్ముతున్నారట...అందుకే దాన్ని చంపుతామని, కూర వండుకు తింటామని బెదిరింపులు వస్తున్నాయట..ఇంతకీ ఈ ఆక్టొపస్ ఎవరో తెలుసుకుందాం.
జర్మనీ పాల్గొనే ప్రతి అంతర్జాతీయ ఫుట్ బాల్ మాచెస్ లో విజయం ఎవరిని వరించబోతోందో అంచనా వేయటానికి ఈ ఆక్టొపుస్ జ్యోస్యం పై ఆదారపడటం జర్మన్ల కు ఆనవాయితీగా వస్తోంది... 2006 లో జన్మించిన ఈ ఆక్టొపుస్ కి పాల్ అని నామకరణం చేసారు.ఈ పేరు ఒక జర్మన్ కవి రాసిన కవిత నుంచి వచ్చింది....దీని నివాసం ఓబర్హాసన్,జర్మనీ లొ ఉన్న సముద్ర జీవుల కేంద్రం.
ఎప్పుడు జర్మనీ ఫుట్ బాల్ మాచ్ లో తలపడుతున్నా, ఇరు జట్ల జాతీయ జెండాలను చుట్టి ఉంచిన రెండు ఆహార పాత్రలు ఈ ఆక్టొపుస్ ముందు ఉంచుతారు….అది ఎవరి పాత్రలోని అహారాన్ని ఎంచుకుంటే ఆ జట్టు ని విజయం వరిస్తుందని నమ్ముతూ వస్తున్నారు...అన్ని సందర్బాలలో ఈ జ్యోస్యం నిజమైందా అంటె కాదనే చెప్పలి.. ఎందుకంటే యూరో 2008 జరుగుతున్నప్పుడు రెండుసార్లు తన జ్యోస్యం తప్పైంది…కాకపోతే 2010 వరల్డ్ కప్ ఫలితాలను 100 శాతం సరిగా చెప్పటం ద్వారా వార్తలలో ని జంతువైంది ఈ బహుబాహుణి...అలాగే మనుషుల్లాగానే పేరు తో పాటు శత్రువులని కూడా సంపాదించుకుంది....
ఇవీ పాల్ ది ఆక్టొపస్ ఇప్పటివరకూ చెప్పిన జ్యోస్యాలు:

Opponent

Tournment

Paul's predictions

Result

Poland

Euro 2008

Germany

Correct

Croatia

Euro 2008

Germany

Incorrect

Austria

Euro 2008

Germany

Correct

Portugal

Euro 2008

Germany

Correct

Turkey

Euro 2008

Germany

Correct

Spain

Euro 2008

Germany

Incorrect

Australia

World Cup 2010

Germany

Correct

Serbia

World Cup 2010

Serbia

Correct

Ghana

World Cup 2010

Germany

Correct

England

World Cup 2010

Germany

Correct

Argentina

World Cup 2010

Germany

Correct

Spain

World Cup 2010

Spain

Correct




Thursday, July 01, 2010

FIFA 2010

ఆసక్తికరంగా మారిన సాకర సమరం!!
ఒకసారి ఫీఫా చరిత్రలోకి తొంగి చూసి ఇప్పుడు సూపర్ 8 కి చేరుకున్న జట్ట్ల ఆట తీరు గమనిస్తే అంతా ఆసక్తికరమే అనిపించింది.
గతం లో నాలుగు సార్లు [1934,1938,1982,2006] విజేత అయిన ఇటలీ కి ఈసారి సూపర్ 8 లొ అడ్డ్రస్సు గల్లంతు !!
1998 లో టైటిల్ కొట్టి గత ప్రపంచ్ కప్ లో ఫైనల్స్ వరకూ చేరిన ఫ్రాన్స్ ఈసారి సూపర్ 8 లో కూడా స్థానం సంపాదించలేకపోయింది.
1966 లో ఒకే ఒక్కసారి ఫైనల్స్ కి చేరి ఆ ఒక్కసారీ గెలిచిన ఇంగ్లండ్ కూడ ఫ్రాన్స్ బాటలోనే ఇంటి దారి పట్టింది.
రెండుసార్లు[1978,1986]విజేతై నాలుగు సార్లు ఫైనల్స్ కి వెళ్ళిన చరిత్ర తో అర్జెంటీనా ,మూడు సార్లు
[ 1954,1974,1990] గెలిచి ఏడు సార్లు ఫైనల్స్ కి చేరిన జర్మనీల తో తలపడబొతోంది..…చాలా ఆసక్తిని రేకిత్తిస్తోంది కదా వీళ్ళిద్దరి పోరు? మిస్స్ అవ్వకండి మరి ఈ మాచ్ ని..జులై 3న ఏబీసి లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది....
మరో రెండు జట్టులు పరాగ్వే మరియు స్పెయిన్ లు కూడా రౌండ్ 8 లో కి ప్రవేశించినా పెద్దగా ఆసక్తి కలిగించటం లేదు కాని ఏమో ఎవరూహించగలరు ....1982 లొ కప్ గెలిచిన చరిత్ర స్పెయిన్ కి ఉంది...కానీ పరాగ్వే 5 పాయింట్ల తో స్పెయిన్ కంటే ఒక పాయింట్ ఆధిక్యంలో ఉంది...
3 సార్లు విజేతలైన జర్మనీలు సూపర్ 8 కి రావటం పెద్ద విశేషమేమీ కాదనుకోండి….
ఇక ఇప్పటికి రెండు సార్లు కప్పు కొట్టిన ఉరుగ్వే సాకర్ లో పసికూన ఘనా తో రౌండ్ 8 లో తలపడుతోంది...పసికూన అనకూడదేమో....ఎందుకంటే ఇదే పసికూన అమెరికా ని రౌండ్ 16 లో కంగు తినిపించటం మనకు తెలిసిందే….
ఇక సాకర్ దిగ్గజం బ్రెజిల్ ఇప్పటికే అయిదు సార్లు[1958,1962,1970,1994,2002] విజయఢంకా మోగించి, ప్రస్తుత టోర్నమెంటు లో పొర్చుగల్ తో మాచ్ డ్రా చేసుకుని రౌండ్ 8 లో కి ప్రవేశించి, గతంలో రెండు సార్లు [1974,1978] ఫైనల్స్ కి వెళ్ళగలినా పరాజయం పాలై విజయం కోసం పరితపిస్తూ ప్రస్తుత టోర్నమెంటు లో ఇప్పటివరకూ అన్ని మాచ్ లూ గెలుస్తూ వస్తోన్న నెదర్లెండ్స్ తొ పోటీకి సిద్దమైంది.....బ్రెజిల్ నిలకడగా ఆడుతూ ముందుకెళుతుందా? లేక విజయదాహంతో ఉన్న నెదర్లెండ్స్ బ్రెజిల్ పై అద్భుత విజయం సాధించి సెమీస్ కి చేరబోతోందా? ఈ సమరం రేపు ఉదయం 10 గం కి ఈఎస్పిఎన్ లో మొదలవుతుంది కాబట్టి అప్పటివరకూ వేచిచూడక తప్పదు.