సర్కారు దవఖాన దుస్థితి!
రాబిస్ వ్యాధి కి మందు లేక కుక్క కాటుకి గురైన వారు మరణిస్తున్నారని వార్త చదివిన తరువాత నాకు 1983 లో వచ్చిన నేటిబారతం సినిమాలోని ఈ క్రింది పాట గుర్తుకొచ్చింది.... ఆసుపత్రుల తీరు ని ఉతికి ఆరేసాడు రచయిత..ఇప్పటికీ ఏమాత్రం మార్పులేదు మన ఆసుపత్రులలో.....వింటూ కాపీ చెసిన ఈ పాటను మీరూ చిత్తగించండి...కొన్ని పదాలు స్పష్టత లేకపోయిన కారణంగా రాయలేక పోయాను...ఎవరికైన తెలిస్తే పంపగలరు.
చిత్రం:నేటి భారతం
గీత రచయిత:బి.క్రిష్ణమూర్తి
స్వర రచన:చక్రవర్తి
గాయని:శ్రీమతి ఎస్ పి శైలజ బ్రుందం
కోడలు:
దమ్ము తోటి దగ్గు తోటి చలిజ్వరమొచ్చిన అత్తో!
అత్తో పోదాం రావె మన వూరి దబాఖానకు
మందులు గోలీలు మంచి సూదులు ఇత్తండ్రంట
మందులు గోలీలు మంచి సూదులు ఇత్తండ్రంట
అత్తో పోదాం రావె మన వూరి దబాఖానకు
అత్త:
అమ్మ తల్లో! నేను రాను!
నేను రాను బిడ్డొ మన వూరి దబాఖానకు
ఎర్ర నీళ్ళ మందు సున్నాపునీళ్ళ సూదు లాయె
నేను రాను బిడ్డొ గండాల దబాఖానకు
రోగి1:
అవునవును!
కడుపులో నొప్పంటే కాలికి కట్టు కట్టే
పన్నుకు బాధంటె కన్నులు పీకెత్తరమ్మొ
వద్దు వద్దు తల్లో యములున్న దబాఖానకు
వద్దు వద్దు తల్లో యములున్న దబాఖానకు
అత్త:
కోడలు పిల్ల నీళ్ళాడ ఆసుపత్రికని పొతే
అంబులెన్సు కి 10 ఆయె వార్ద్ బాయ్ కి 15
ఆడపిల్ల పుడితె 20 మొగోడు పుడితె 30
మంచానికి 50 మందులేమొ వుండవాయె
వద్దు వద్దు తల్లొ లంచాల దబాఖానకు
రోగి 2:
అవునవును!
ఆడు సీటి రాస్తె లంచం
ఈడు గేటు తీస్తె లంచం
ఆ సిట్టరమ్మ కు లంచం
చిన డాక్టరయ్యకు లంచం
ధరలాసు పత్రి ఆయె దరి లేని దోపిడాయె
వద్దు వద్దు తల్లొ దగుల్బాజి దబాఖానకు