అక్కినేని అస్తమయం!!
ఈ రోజు తెల్లవారి జామున 3:00 గం ప్రాంతం లో అక్కినేని తుదిశ్వాస విడిచారని టీవి9 ద్వారా తెలిసింది.
చిత్ర సీమలో సుదీర్ఘప్రయాణం ఆయనిది..ఎన్.టీ.ఆర్[1947- మనదేశం] కంటే ముందే చిత్రసీమలో [1941-ధర్మపత్ని ద్వారా]ప్రవేశించారట....ఈ కళా దిగ్గజం ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన గురిచి కొన్ని విషయాలు రాయాలనిపించింది.అల్లాగే , ఈయన మరణం తో మాయాబజార్ టీములో ఇక మనకెవరూ మిగలలేదు.ఆ సినిమాని కలర్ లో తిలకించే అద్రుష్టం ఈయనకే దక్కింది.
అన్న ఎన్ టీఆర్ తో కూడా ఆయన అనుభంధం సుదీర్ఘమైనది. ఈ సందర్భంగా వారిద్దరి అనుభంధం గురించి సీనియర్ విలేఖరి యు.వినాయకరావు గారు "యుగానికి ఒక్కడు" పుస్తకం లో ఇలా వివరించారు.
"సమ ఉజ్జీలైన ఏ.ఎన్.ఆర్ & ఎన్.టీ.ఆర్ ఒకరితో ఒకరు పోటీ పడి చిరస్మరణీయమైన నటనని అందించి తెరస్మరణీయులు గా మిగిలారు.నటనలో మాత్రమే గాదు మరెన్నో విషయాల్లో వీరిద్దరూ ఎందరికో మార్గదర్శకులు.పారితోషికం పెంచవలసిన తరుణంలో ఇద్దరూ కలసి కూర్చుని చర్చించుకుని నిర్మాతలకు భారం కాకుండా నిర్ణయాలు తీసుకునేవారు.ఈ అగ్రనటులు కలసి నటించిన చిత్రాలలో అధికశాతం విజయవంతమైనవే.
తెలుగు చిత్రసీమకు ఏ.ఎన్.ఆర్ & ఎన్.టీ.ఆర్ రెండు కళ్ళని సంభోధిస్తూ ఆత్మీయంగా ఆదరించారు తెలుగు చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు.ఆ అభినందనకు తగినట్లుగానే ఆదర్శవంతమైన స్నేహబంధాన్ని కొనసాగించారిద్దరూ.ఒకే వ్రుత్తిలో ఉన్నందువలన కొన్ని సందార్భాలలో అభిప్రాయభేదాలు తలెత్తినా అవి తాత్కాలికంగానే ఉండేవి. వీరిద్దరూ కలిసి 14 చిత్రాలలో నటించి అరుదైన రికార్డు నెలకొల్పారు.
ఆయన అన్నగారు కలిసి నటించిన సినిమాల చిట్టా ఇదిగో:
పల్లెటూరిపిల్ల - 1950
సంసారం - 1950
రేచుక్క - 1954
పరివర్తన - 1954
మిస్సమ్మ - 1955
తెనాలిరామక్రిష్ణ - 1956
చరణదాసి - 1956
మాయాబజార్ - 1957
భూకైలాస్ - 1958
గుండమ్మకథ - 1962
శ్రీక్రిష్ణార్జున యుద్ధం - 1963
చాణక్యచంద్రగుప్త - 1977
రామక్రిష్ణులు - 1978
సత్యం శివం - 1981