Sunday, May 23, 2010

వేటూరి అస్తమయం !!!

వేటూరి అస్తమయం తో ఒక పాటల శకం ముగిసింది అని చెప్పవచ్చు....ఒక్క పరభాషాపదం కూడా లేకుండా పాట కావాలంటే అది వేటూరి వల్లే అవుతుంది అని నిర్మాతలు ఇప్పటికీ నమ్ముతున్నారు కాబట్టే కొత్తగా వచ్చిన బ్లాక్బస్టర్ "సిం హా " లో "కల్యాణం కల్యాణం లక్ష్మినరసిమ్హా కల్యాణం.." పాట రాయించుకున్నారు....సినిమాలు ఆడక పోయినా ఆయన పాటలు వాడవని "వరుడు" సినిమాలో ఆయన రాసిన "అయిదు రోజుల పెళ్ళి అమ్మంటి పెళ్ళీ...." అనే పాట చెపుతుంది...
"ఆకుచాటు పింద తడిసే..." అని శ్రుంగారాలు కురిపించినా,
"శంకరా నాద శరీరాపరా..." అని భక్తిభావం ఒలికించినా,
"ఆరేసుకోబొయి పారేసుకున్నాను హరి హరి..." అని కొంటె పాటలు రాసినా,
"క్రుషి ఉంటే మనుషులు రుషులవుతారు..." అని అడవిరాముడు లో గిరిజనుల వెన్నుతట్టినా,
"ఈ దుర్యోధన దుశ్సాసన దుర్వినీతలోకంలో..." అని తప్పుదారిన పడుతున్న యువత నీ & కళ్ళు ఉండీ చూడలేని గుడ్డి ప్రభుత్వాలనీ చీల్చి చెండాడినా ,
గూండాలకే ఓటు రౌడీలకే సీటు దేశానికే చేటు..." అని ప్రజలను మరియు రాజకీయ పార్టీలను హెచ్చరించినా,
"ధన్వంతరి వారసులం ధరణి లోన దేవతలం..." అని ఎవరు సమ్మె చెసినా డాక్టర్లు సమ్మె చేయకూడదని హితవు చెప్పినా,
"వేణువై వచ్చాను భువనాని కీ...." అని విషాదం పలికించినా,
అది ఒక్క వేటూరి కలానికే చెందింది....ఇంతటి వైవిద్యం మరి ఇక ఏ భారతీయ కలానికైనా ఉంటుందని అనుకోను..
ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కాంక్షిస్తూ ఇదే నా అక్షర నివాళి !!!
-సత్య

Saturday, April 11, 2009

పేరుకు మాత్రమే కావాలి ఇది విరోధి నామ సంవత్సరం

వచ్చేసింది ఉగాది విరోధి
నవ వసంతానికిదే ఆది
మావి తొడిగింది కొత్త కొత్త చివురులు
తీపి రాగాల ఆ కోయిలమ్మ గొంతు సవరింపులు
పేరుకి మాత్రమే అవ్వాలి ఇది విరోధి
కావాలి లే ఇది కొత్త కొత్త స్నేహాలకు పునాది
అవ్వదులే మన సుఖ సంతోషాలకి ఎప్పుడూ ఇది అవరోధి
ఆశిద్దాం అవుతుందని మన అందరి పాలిట పెన్నిధి
అవినీతి పాలకుల కు కావాలి విరోధి
బంధు ప్రీతి ప్రజా వ్యతిరేక పాలనకు శాశ్వత సమాధి
యాసిడ్ దాడులకి రేగింగ్ లాంటి విక్రుత సంస్క్రుతి కి విరోధి
మహిళల మాన ప్రాణాలను హరించే రావణ దుర్యోధన కీచక సంతతికి ఇదే సజీవ సమాధి
ఆర్ధిక మాద్యానికి కావాలి ఇది సమాధి
ప్రతి నిరుద్యోగికీ అదే అదే అవుతుంది ఉపాధి

Friday, May 02, 2008

నా మట్టు కు నాకు ఇది ముమ్మాటి కీ శ్రీ నందమూరి తారక రామారావు అంతర్జాతీయ విమానాశ్రయమే!!!!

పాలక తెలుగు ద్రోహులు ఏ పేరు పెట్టినా అందులో నేను భాగస్వామిని కాదు కాబట్టి, నా కంఠం లో పాణం ఉన్నంతవరకూ ఈవిమానాశ్రయాన్ని ఈ పేరుతోనే వ్యవహరిస్తానని ఈ బ్లాగ్మమహాసభ సమక్షమున ప్రతిజ్ఞ చేస్తున్నాను.....సాటి తెలుగువాడి గా మీరుకూడా దీనిని స్వాగతిస్తారని నమ్ముతున్నాను !!!!!!



















సమయం లేదు!!!!!

మనిషి జీవితంలో సంతోషం ఉన్నా, ఒక చిరు నవ్వుకే సమయం లేదు
రాత్రి పగలు పరుగెడుతూనే వుండే లోకంలో, జీవితం కోసం సమయం లేదు
అందరి పేర్లు మొబైల్ లో ఉన్నాయి, కాని వారితో స్నేహానికే సమయం లేదు
కళ్ళలో ముంచుకొచ్చే నిద్ర, ఒక కునుకు తీయటానికే సమయం లేదు
కాసుల వేటలో ఒకటే పరుగు, దానికి అలుపు సొలుపు తరుగు
ప్రతి క్షణం నవ్వే వారికి, వారి వారి సంతోషానికి మాత్రం సమయం లేదు

ఈ సమయంతో పాటు పరుగుతీయడానికి ఎక్కడ సమయమూ సరిపోవడంలేదు :(

Monday, April 28, 2008

మన బాపు కొంటె గీతలు

చూసినవే అయినా ఆయన హాస్య చతురత మరో సారి మీతో పంచుకోవాలని ఒక చిన్న ప్రయత్నం....






















Friday, April 25, 2008

ఈ రచన కు శీర్షిక మీరే సూచించండి....

వంటరితనానికి భయపడేవాడను
నన్ను నేను ఇష్టపడటం నేర్చుకున్నప్పటి వరకు
అపజయానికి భయపడేవాడను
అది నా ప్రయత్న లోపమని గ్రహించినప్పటి వరకు
విజయానికి భయపడేవాడనుఅది నా ఒక్కడి సంతృప్తి కొరకే అని గ్రహించినప్పటి వరకు
మనుషుల అభిప్రాయాలకి భయపడేవాడను
ప్రతి మనిషికి మరో మనిషి పై ఒక అభిప్రాయం ఉంటుంది అని గ్రహించినప్పటి వరకు
తిరస్కారానికి భయపడేవాడను
నన్ను నేను విశ్వసించటం నేర్చుకున్నప్పటి వరకు
కష్టానికి భయపడేవాడను
ఎదగడానికి అది ఒక చిన్న అవరోధం అని గ్రహించినప్పటి వరకు
నిజమంటే భయపడేవాడను
అబద్దం వికృత రూపం చూసేంత వరకు
జీవితం అంటే భయపడేవాడను
దాని అందాన్ని ఆస్వాదించేప్పటి వరకు
మరణం అంటే భయపడేవాడను
అది దాని అంతం కాదని ఆరంభమని గుర్తించే వరకు
గమ్యం అంటే భయపడేవాడను
నా జీవితాన్ని మార్చుకోగల శక్తి నాలోనే వుందని గ్రహించు వరకు
ద్వేషమంటే భయపడేవాడను
అది కేవలం అజ్ఞానమని తెలిసే వరకు
ప్రేమంటె భయపడేవాడను
అది నా హృదయాన్ని తాకనంత వరకు
భవిష్య కాలమంటే భయపడేవాడను
జీవితం వృద్ధి చెందుతోందని గ్రహించు వరకు
భూత కాలమంటే భయపడేవాడను
అది ఇక నన్నేమీ చెయలేదని గ్రహించు వరకు
అంధకారమంటే భయపడేవాడను
తారల సౌందర్యం తిలకించువరకు
మార్పు అంటే భయపడేవాడను
అందమైన సీతాకోకచిలుకగా ఎగిరేముందు
దానికి విక్రుతమైన గొంగళి పురుగు రూపం ధరించక తప్పలేదని గ్రహించు వరకు

మన శ్రీధర్ ని ఆంధ్ర ఆర్ కె లక్ష్మన్ అనటం అతిశయోక్తి కాదేమో!!!