పాలక తెలుగు ద్రోహులు ఏ పేరు పెట్టినా అందులో నేను భాగస్వామిని కాదు కాబట్టి, నా కంఠం లో పాణం ఉన్నంతవరకూ ఈవిమానాశ్రయాన్ని ఈ పేరుతోనే వ్యవహరిస్తానని ఈ బ్లాగ్మమహాసభ సమక్షమున ప్రతిజ్ఞ చేస్తున్నాను.....సాటి తెలుగువాడి గా మీరుకూడా దీనిని స్వాగతిస్తారని నమ్ముతున్నాను !!!!!!
9 comments:
నేను కందుకూరి వీరేశలింగం విమానాశ్రయం అనుకుంటున్నాను.
నేను మీ అభిప్రాయాలతో నూటికి నూరు పాళ్ళు ఏకీభవిస్తా. ఉన్నపేరుని తీసేయడం నీచాతి నీచం.
పద్మనాభం దూర్వాసుల
"నా మట్టు కు నాకు ఇది ముమ్మాటి కీ శ్రీ naaraa chandra babu అంతర్జాతీయ విమానాశ్రయమే!!!!"
మీ అభిప్రాయాలతో నెను కూడా ఏకీభవిస్తున్నా.మనకై మనం నామకరణాలు చేసుకుంటే సరిపోదు కాబట్టి కొన్ని సూచనలు.ఇప్పుడున్న షంషాబాద్ ఎయిర్ పోర్టును మనం,మన బంధువులు,స్నేహితులు,కుటుంబసభ్యులు,వీలైతే ఇరుగుపొరుగు అసలు ఉపయోగించకకుండా ఉండటం,సదరు షంషాబాద్ ఎయిర్ పోర్టునుంచి దిగుమతయ్యే ఏ వస్తువునూ వాడకపోవటం,మనకు సంబంధించినవి ఏవీ షంషాబాద్ ఎయిర్ పోర్టునుంచి ఎగుమతి కానివ్వకపోవటం,నందమూరి తారకరామారావు పేరిట మళ్ళీ పునఃప్రారంభించమని సంబంధిత ప్రభుత్వశాఖలన్నిటికీ ఉత్తరాలు రాయటం,ఇ-మెయిల్ క్యాంపయినులు ముమ్మరంగా చేపట్టాలి.
అవును ఇదివరకు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారి టపాలో ఒక బ్లాగరు గారన్నట్టు హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం (ఏయిర్పొర్ట్ )అని ఎందుకు పిలుచుకోకూడదు, వ్యక్తుల పేర్లతో కాకుండా?
నేను కందుకూరి k.c.R విమానాశ్రయం అనుకుంటున్నాను.
నేను potti sri ramulu విమానాశ్రయం అనుకుంటున్నాను.
తెలుగు వారి గడ్డ మీద నిర్మించిన విమానాశ్రయానికి తెలుగు వారి పేరే పెట్టాలని ప్రతి తెలుగు వాడు కోరుకుంటున్నాడనటానికి ఈ అభిప్రాయాలే సాక్ష్యం....చెవిటి ప్రభుత్వమైతే ఏలాగో వినిపించవచ్చు... కాని ఇది చెవుడున్నట్లు నటించే ప్రభుత్వం.
అసంరాలో ఇంత వరకూ నేను వాషింగ్టన్, లింకన్, కెన్నడీ, మార్టిన్ లూథర్ కింగ్ తప్ప మిగిలిన వారి పేర్లమీద ఏమీ చూసిన గుర్తు లేదు. వీళ్ల పేర్లు కూడా ఏదో ఒక మహా నిర్మాణానికే ఉన్నాయి కానీ వందలకొద్దీ చోట్ల లేవు. మన వాళ్లు కూడ ఈ పద్ధతి అనుసరించ వచ్చు కదా. అన్నిటికీ రాజీవ్ పేరు పెడితే ఏది ఏదో అర్ధం కాకుండా పోతుంది. మహారాష్ట్రలో మరీ ఘోరం. ప్రతి రెండోదీ శివాజీ పేరిటే ఉంటుంది. ప్రభుత్వాలు అడ్డగోలుగా ఇష్టమొచ్చిన పేర్లు పెట్టటానికి వీల్లేకుండా ఒక శాసనం చెయ్యాలి. లేదా, ఏదన్నా ప్రముఖ స్థలానికో, నిర్మాణానికో ఒకరి పేరు పెట్టబోయే ముందు రిఫరెండం లాంటిది చెయ్యాలి (అసంరా లో ముఖ్యమైన విషయాల్లో ప్రపోజిషన్స్ పేరుతో ప్రజల తీర్పు కోరినట్లన్నమాట)
http://anilroyal.wordpress.com
Post a Comment