Saturday, June 12, 2010

తాడిచెట్టు ఎందుకెక్కావురా అంటే..................

తాడిచెట్టు ఎందుకెక్కావురా అంటే దూడ మేత కోసం అన్నట్టు ఏడ్చింది నీ రాజకీయం!!

అధికార పార్టీని పొగిడేసి
ఆరేళ్ళ క్రితం అధికారాన్ని కోల్పోయిన ప్రతిపక్షాన్ని తిట్టేసి
సిగ్గు విడిచి సోనియా ముందు చిందేసి
తెలుగువాడి పరువు 10 జనపథ్ వీధిన పడేసి
పదవులపై మోజులేదంటూనే ముఖ్య పదవి పై కన్నేసి
నీవు అటుకేసి ఇటుకేసి కాంగీరేసి
ప్రజల కి నీ రాజకీయం పై రోతపుట్టేసి
చూస్తున్నారు వచ్చే ఎన్నికలకేసి !!!
మీకు ఈసరికే అర్థం అయ్యేసి
నేను మాట్లాడేది ఎవరికేసి?

Tuesday, June 01, 2010

మఖ లో పుట్టి పుబ్బ లో......

కాంగీ కి రాజ్యసభ ఎన్నికలలో ప్రరాపా మద్దతట
ఈ మద్దతు వాణిజ్యపరం కాదని ఆపైన బొంకు అట !!
పైకి ప్రజాస్వామ్యం మీద ప్రేమని వాక్రుచ్చుట
లోలోపల మంత్రి పదవులొస్తాయని చొంగలార్చుట !!
జెండా పీకేత్తారని పత్రికలు ఎప్పుడో పసిగట్టెనట
అంతలోనే అదంతా మీడియా కట్టుకథని బుకాయింపట !!
స్తానిక ఎన్నికల్లో పరువు కోసం ప్రాకులాట అట
మొత్తం పార్టీనే కలిపేయరాదా ఎందుకొచ్చిన ఈ దొంగాట!!
మఖ లో పుట్టి పుబ్బ లో మాడిపోయే పార్టీల జాబితా లో మరో పార్టీ చేరబోతోందట !!!