Tuesday, June 01, 2010

మఖ లో పుట్టి పుబ్బ లో......

కాంగీ కి రాజ్యసభ ఎన్నికలలో ప్రరాపా మద్దతట
ఈ మద్దతు వాణిజ్యపరం కాదని ఆపైన బొంకు అట !!
పైకి ప్రజాస్వామ్యం మీద ప్రేమని వాక్రుచ్చుట
లోలోపల మంత్రి పదవులొస్తాయని చొంగలార్చుట !!
జెండా పీకేత్తారని పత్రికలు ఎప్పుడో పసిగట్టెనట
అంతలోనే అదంతా మీడియా కట్టుకథని బుకాయింపట !!
స్తానిక ఎన్నికల్లో పరువు కోసం ప్రాకులాట అట
మొత్తం పార్టీనే కలిపేయరాదా ఎందుకొచ్చిన ఈ దొంగాట!!
మఖ లో పుట్టి పుబ్బ లో మాడిపోయే పార్టీల జాబితా లో మరో పార్టీ చేరబోతోందట !!!

3 comments:

Anonymous said...

జగన్ మీద కోపంతొ చిరంజీవి ని ప్రోత్యహించడమంటే కూర్చొన్న చెట్టు కొమ్మను నరుక్కోవడంలాగ ఉంటుంది.రేపు అసలైన కాంగ్రెస్ వాదులను మీరు దూరం చెసుకుంటారు.ముఖ లొ పుట్టి పుబ్బ లో కనుమరుగు కాగల పార్టిల వలన లాభం ఎంతో ఆలోచించాలి.నేల మీద పడ్డ బంతి తిరిగి అంతె వేగంతొ తిరిగి మీదకు వస్తుంది . ఇది చరిత్ర చెప్పిన సత్యం. కనీసం ప్రజల మధ్యకు వెళ్ళలేని రాజకీయ నాయకుల మాటలను పట్టుకొని కాంగ్రెస్ అధిస్టానం ఆటలాడుతుంది.జగను నిలువరించితె రేపు సీమాంద్ర లొ కాంగ్రెస్ బ్రతికి బట్టకలుగుతుందని ఎవరైనా అనుకుంటె వారి అమాయకత్వానికి మనం ఎమిచెయలెము.ప్రజారాజ్యం సత్తా ఏపాటితొ తెలియందికాదు.18 శాతం ఓట్లు వచ్చియి అనుకుంటె పొరపాటు. ఎందుకంటె ఈ 18 శాతం ఓట్లు తెలుగుదేశం మాజీ నాయకులు ప్రజారాజ్యం లొ పని చెయడం వల్ల వచ్చినాయి. ఇప్పుడు ఆ తెలుగుదేశం మాజీ నాయకులు ఎక్కడ ఉన్నారో అందరికి తెలుసు . కాబట్టి చిరంజీవి గారి ప్రజారాజ్యం తొ పొత్తు పెట్టుకుంటె ఒరిగేదేమిలేదు ఒక్క అసలైన కాంగ్రెస్ వాదులను దూరం చేసుకోవడంతప్ప.

A K Sastry said...

నీ ముక్కెక్కడుంది? అని అడిగితే……..చెయ్యి తలవెనుకనించి తిప్పి, ముందుకు తెచ్చి, చూపుడువేలితో ముక్కు చూపించాడట ఒకడు!

జగన్ కి వ్యతిరేకం గా, మన హీరో అయితే నెగ్గచ్చు అని అంచనాకి వచ్చిన కాంగీరేసులు, ప్రరాపాని ఓ ప్రాంతీయపార్టీ లెవెల్లో నిలబెడితే, చంద్రబాబుని కూడా గెలవచ్చు అని పథకం వేసి, 'చిరు' ని దువ్వారు!

చిరూ అభిమతం ముఖ్యమంత్రి అవ్వాలనే కదా?

ముక్కు చూపించడానికి యేమార్గమయితేనేం?

మనకి మాత్రం, యే రాయయితేనేం? పళ్ళూడగొట్టుకోడానికి?

A K Sastry said...

మరిచాను—సామెత ‘పుబ్బలో పుట్టి, మఖలో మాడటం’

అంటే, కనీసం ఓసంవత్సరం కూడా మనలేకపోవడం!