Friday, July 09, 2010

ఫ్రీమేకు పాటలు!!

సినిమా పరిశ్రమలో ముఖ్యంగా మేకులు[డైరెక్ట్] మరియు రీమేకులు అని రెండు రకాలనుకుంటే అనధికారికంగా ఫ్రీమేకు అని మరోకటి ఉంది.మన దేశీ సినిమా సంగీత దర్శకులు విదేశీ సంగీతాన్ని అప్పుడప్పుడు ఫ్రీమేక్ చేస్తూ పాటలు సమకూరుస్తారు అన్న విషయం మన అందరికీ తెలిసిందే….అవి కూడ సూపర్ హిట్స్ అవుతుండటం మనం వింటూనే వున్నాం……అలా దిగుమతైన ఒక పాట గురించి నా శ్రీమతి ఈమధ్య నా దగ్గర ప్రస్థావించడం జరిగింది……ఆ పాట పోకిరి చిత్రం కోసం మణిశర్మ సంగీతం సమకూర్చిన 'గల గల పారుతున్న గోదారిలా.'….కాకతాళీయమో లేక కావాలనే చేసారో గాని ,1974 లో సూపర్ స్టార్ క్రిష్ణ నటించిన 'గౌరి ' చిత్రం లోని అదే 'గల గల…' పాటకి ఇది రీమిక్స్ అట…..మరి గౌరి చిత్రం లోని పాట దేనికి రీమిక్సో తెలుసుకోవాలనుందా?…అందుకోసం మీరు అప్పటికి 35 ఏళ్ళు వెనక్కు వెళ్ళాలి మరి.…..అంటే 1939 లొ హోసే ఫెలిషియానో అనబడే ఆంగ్ల గాయకుడు పాడగా విడుదలైన ఒక ఆంగ్ల నర్సరీ గీతానికి మహా నకలు అనితెలిసింది….…ఇక్కడ క్లిక్ చేసి మీరూ వినవచ్చు.
అలాగే, జగపతిబాబు ప్రియమణి జంటగా నటించగా ఈ మధ్య విడుదలైన ప్రవరాఖ్యుడు సినిమా కోసం కీరవాణి కూడ అమెరికన్ గాయకుడు జస్టిన్ టింబర్లేక్ ఆల్బం నుంచి ఒక పాట ని ఇలాగే ఫ్రీమేకు చేసుకున్నట్లు తెలిసింది...ఆ పాటని టీవీ9 పరిశోధించి ప్రసారం చేయగా యూట్యూబ్ లో కూడ పెట్టారు...దానికోసం ఇక్కడ చ్లిక్ చేయండి.

3 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

గౌరి చిత్రంలోని పాట చిమట మ్యూజిక్ లోనే ఉందిగదండీ!

Bujji said...

గౌరి పాట ఉంది గాని ఆ ఇంగ్లీష్ పాట లేదు కదండీ!ఆ మూడు ఒకేసారి విని పోల్చుకోవచ్చు కదా అని ఆ వెబ్ సైట్ గురించి ప్రస్థావించానని మాట!

sangi said...

భలే పోల్చారండి. కాపీ చేయటం ఇంత ఈజీ అని తెలిస్తే మనం కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేవాల్లమేమో. ఒక నాలుగేళ్ళు పనిచేసి రిటైర్ అయిపోవొచ్చు. ఆ తర్వాత ఏ TV ప్రోగ్రాం కో హస్ట్ అవ్వొచ్చు.... Rao