రక్త చరిత్ర సినిమా - నాణేనికి ఒకవైపు:
సినిమాను ప్రకటించినప్పటి నుంచీ వార్తలలో ఉంటూ వస్తూన్న "రక్త చరిత్ర-1" సినిమా ఓబులరెడ్డి వర్గాల బెదిరింపులను, స్వచ్చంద సంస్థల హెచ్చరికలను మరియూ సెన్సారు అవరోధాలను కూడా దాటుకుని ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది.సినిమా లో పెద్దాయన ఎన్ టీ ఆర్ ని పోలిన ముఖ్యమంత్రి పాత్ర ని చిత్రీకరించిన విధానం ఆయన ను ఆరాధ్యదైవం గా భావించే అశేష అభిమాన జన మనోభావాలను గాయపరిచేవిధంగా ఉంది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.....ఆ విమర్శల ధాటికి, క్షమాపణ అనే పదానికి నా నిఘంటువు లో చోటు లేదు అని తరచూ ప్రకటించుకునే వర్మ మీడియా ముందుకొచ్చి క్షమాపణ లు చెప్పి "అభ్యంతరకర సన్నివేశాలు గా భావిస్తున్న వాటిని తొలగిస్తున్నాను అని ప్రజలకి మాటివ్వటం జరిగింది".
నాకు కూడా సినిమా చూస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి పాత్ర కథానాయకుడు కి అండగా నిలబడినందున అంతగా అనిపించలేదు కాని , థియేటర్ నుంచి ఇంటికొచ్చిన తరువాత విశాల ధ్రుక్పథం తో ఆలోచించినపుడు, "అవునూ, పెద్దాయన "అహం ! బ్రహ్మాస్మి" టైపు అనే తెలుసు గాని ఏనాడూ కక్షలు కార్పణ్యాలకు కొమ్ము కాసినట్లు గా లేదా ప్రోత్సహించినట్లు గా ఎప్పుడూ చదవలేదు వినలేదు కదా... ఇలా చూపించారేంటి" అని అనిపించింది.
మరో విషయం ఎమిటంటే, రాయలసీమలో ని అనంతపురం నేపధ్యం ఉన్న ఈ యదార్థ గాథ లో అదే నేపధ్యం కొరవడింది....మీకు సినిమాలో ఎక్కడా రాయలసీమ లేక తెలుగు వారి నేపధ్యం కనపడదు....కాని టీవి9 లాంటి మీడియా మైకులు మాత్రం కనపడతాయి....మరి 82 లెదా 83 లో ఎలెక్ట్రోనిక్ [ఉదా:టీవి9..] మీడియా ఎక్కడుందో సినిమా చూసే ప్రేక్షకుడికి బోధపడదు....సినిమా అంతా సాగే వాయిస్ ఓవర్ ని వర్మ కాకుండా రవిప్రకాష్ లాటి డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించి ఉంటే బావుండేదనిపించింది.
పరిటాల రవి హైదరాబాదు గూడాలని ఇంటికి ఆహ్వానించి రాగి సంకటి కోడికూరలతో భోజనం పెట్టించి గూండాగిరీలు భూకబ్జాలు ఇకపై నగరం లో ఎక్కడా జరగ కూడదని హెచ్చరించటం తో ముగించి మిగతా నవంబర్ 19న విడుదల కాబోయే "రక్త చరిత్ర-2" లో చూసుకోమన్నారు....తమిళ నటుడు సూర్యా కూడా రెండవ భాగం లోనే మద్దెలచెరువు సూరి గా రాబోతున్నాడు....ఇది కచ్చితంగా మహిళలు పిల్లలు చూడ తగిన సినిమా కాదు అని ప్రేక్షక లోకం మరియూ మీడియా కూడా కోడైకూస్తోంది....
రక్త చరిత్ర సినిమా - నాణేనికి మరో వైపు:
సాంకేతికంగా చూస్తే , ఉత్కంఠభరితమైన కథనానికి [స్క్రీన్ ప్లే] పర్యాయ పదం వర్మ....పెద్దగా మలుపులు లేని ఇలాంటి కథని తీసుకుని [ప్రేక్షకులు వెకిలి హాస్యానికి పంచ్ డైలాగులకీ అలవాటుపడిపోయిన ఈ రోజుల్లో] తెరపై ఆవిష్కరించిన విధానం [హింస ని మరియూ బుక్కారెడ్డి శ్రుంగార సన్నివేశాలని మినహాయించి] ప్రేక్షకులని మంత్రముగ్దులని చేసి కుర్చీలకి కట్టి పడేస్తుంది....
**** సశేషం ! ****
2 comments:
mee comment bagundi. chakkaga chpparu
aakaliaakali.blogspot.com
rakta chrithrapi mee parisheelana bagundi.
aakaliaakali.blogspot.com
Post a Comment