ఇటీవల రాష్త్రం లో జరిగిన రెండు సంఘటనలు...
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ దగ్దం: ఈ సంఘటన మాత్రం నా మనసుని తీవ్రం గా కలచి వేసింది....నాకు తెలిసి, ఆయన కేవలం మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రమే కోరి ఆ దిశగా ధ్రుఢ చిత్తం తో, అహింసా పద్దతి లో పోరాడి తన ప్రాణాలనే పణంగా పెట్టి దాన్ని సాధించాడు[1953 లో].మరి ఆ తరువాత 3 ఏళ్ళకి 1956 లో ఏర్పడిన సమైఖ్య రాష్ట్రావతరణకు ఆయనికి ఏమిటి సంబంధం? ఆయన ఉద్యమ స్ఫూర్తి ని ఆదర్శంగా తీసుకోవల్సింది పోయి అమరజీవి విగ్రహాన్నే తగులపెట్టిన దుండగులకీ మరియూ తాలిబాన్ లో బుద్దుడి విగ్రహాలని కూల్చిన ఉగ్రవాదులకి మధ్య నాకు ఆట్టే తేడా కనపడటం లేదు....అసలు ఇలాంటి దుశ్చర్యల కారణంగానే వారు కోరుకునే ప్రత్యేక రాష్ట్రం ఆలస్యం అవుతుందనే విషయం తెలుసుకోలేక పోతున్నారు...మన రాష్ట్రంలో కొలువు తీరిన మూగ గుడ్డీ చెవిటి నపుంసక ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు....ఇక ప్రతిపక్షం అంటారా....దాని స్థితి మరింత ఆగమ్యగోచరంగా తయారయ్యింది....
తెలుగు కి త్రుటిలో తప్పిన అవమానం:మరో సంఘటన, టి సుబ్బరామి రెడ్డి అనబడే ప్రచార పిశాచి కి తన పదవీ దాహం లోనించి ఒక ఆలోచని పుట్టింది...అదేమిటంటే, "హైదరబాదు నగర నడి బొడ్డున నెలకొని రాష్ట్రం లోనే మొట్టమొదటి ఓపెన్ థియేటర్ గా ఖ్యతి నార్జించిన "తెలుగు లలిత కళా తోరణం" [నేను నర్తనశాల సినిమా ఇక్కడే చూసాను ] కి రాజీవ్ గాంధీ కళా తోరణం పేరు పెట్టి ఇటలీ అమ్మను ప్రసన్నం చేసుకుని మంత్రి పదవి కొట్టేయటం". ఇదీ వారి ఆలోచన...ఆలోచన రావటమే తరువాయి, రాష్ట్రం లో ఉన్న దిష్టి బొమ్మ ప్రభుత్వాన్ని బైపాస్ చేసి డిల్లీ నించి అనుమతి తెచ్చుకోవటమూ, దానికి 3 జీ ఓ లు జారీ కావటమూ చక చకా జరిగిపోయాయి...విషయం బయటకు తెలవగానే మీడియా లో ప్రజలు, ప్రజా సంఘాలు మరియూ వివిధ రాజకీయ పార్టీలు తీవ్రం గా వ్యతిరేకించటం తో పాటు తెలుగు దేశం పార్టీ పబ్లిక్ గార్డెన్స్ లో చేపట్టిన నిరసన కార్యక్రమం తో తనకు తానుగా "కళా బంధు" అని అభివర్ణించు కొనే సదరు పిశాచి దిగి వచ్చి తన ప్రణాలిక ను ఉపసం హరించుకోవటం తో తెలుగు భాషాభిమానులందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.....తెలుగు వారి అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు విషయంలో కూడా ఇదే ఐఖ్యతా పోరాట పటిమ కావాలి....ఆ దిశగా ఉద్యమించి విమానాశ్రయానికి మన తెలుగువారి పేరు పెట్టించుకోవాలి.......తెలుగువారికి అంతర్జాతి ఖ్యాతి నార్జించి పెట్టిన పెద్దాయన ఎన్ టీ ఆర్ కు అదే నిజమైన నివాళి అవుతుంది.....
2 comments:
అక్కడి వారికి మొత్తం తెలంగాణా ని ఆంధ్రా ని కలపటానికి ఈయన దీక్ష చేసి చనిపోయాడు అనే భావన లో ఉన్నారేమో ? మరి తెలంగాణా కి ఏ సంబంధమూ లేని ఆయన విగ్రహం ప్రతి తెలంగాణా జిల్లాలో ఎందుకు పెట్టారు... నాకు ఏమాత్రం అర్థవంతమైన పని లా కనిపించటం లేదు..
I agree with you sir.
Post a Comment