"లక్కుతో శివ సినిమా తీసి "షోలే" ని చెడకొట్టి
పిచ్చి వాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మా
హిచ్చికాకు సినిమాలు చూసి దెయ్యాల సినిమాలు తీసే
రాంగోపాల్ వర్మా డైరెక్టరా కర్మా"
అని తనను తానే తిట్టుకునే [మరొకరికి తిట్టే అవకాశం ఇస్తే బూతులు తిడతారనేమో] వింతజీవి ఆర్జీవి అని మనకు తెలుసు... ఈ జీవి మొన్నామధ్య హరిహరాదులు అడ్డు వచ్చినా "బెజవాడరౌడీలు" టైటిల్ మార్చేదిలేదు అని విర్రవీగి ఇప్పుడు దాన్ని "బెజవాడ" గా మారుస్తున్నాను అని ప్రకటించి కింద పడ్డా తనదే పైచేయి అని ఎలా ట్వీటుతున్నాడో క్రింద చదవండి..
" కొన్ని కారణాల వల్ల "బెజవాడ రౌడీలు" పేరు "బెజవాడ" గా మార్చాను.కారణం ఏమిటని ఎమేమి వూహాలు చేసుకున్నా అసలు కారణం నా ఒక్కడికే తెలుసు !! "- విచిత్ర 'జీవి '
Friday, August 26, 2011
Wednesday, August 24, 2011
జగత్ "కిలాడి" రాజకీయం!!
అవినీతికి వ్యతిరేకంగా రాజీనామాలు చేయటం సాధారణం.... వినాశకాలే విపరీత బుద్ది అని ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేక పోగా తగుదునమ్మా అంటూ సిగ్గు విడిచి అవినీతికి అనుకూలంగా రాజీనామాలు చేయించటం అసాధారణమె కాదు అసహ్యకరం.... అతి జగుప్స్తాకరం!!!
అరే! వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అంటాడే కాని "నేను తినలేదు" అని ఒక్కమాటా అనడే.....అమ్మగారితో ప్రధానికి వ్రాయించిన లేఖ లో కూడా వైయ్యెస్ కి ఇచ్చే మర్యాద ఇదేనా అని వాపోయారే గాని మేము నిర్దోషులం అని చెప్పుకోలేక పోయారే.....అవునులే...దోషులమని వారి అంతరాత్మ పదే పదే ఘోషిస్తుంటే ఎలా అంటారు.
దాని పర్యవసానమే ఈ రోజు పై కోర్టు "విచారణపై" స్టే పిటీషన్ రెండోసారీ కొట్టివేయటం ద్వారా కర్రు కాల్చి వాత పెట్టి పంపించినట్లైంది...వీటికి తోడు హవాలా చట్టం ఉల్లంఘనలు బయటపడుతున్నాయి.....ధనయగ్నం లొసుగుల డొంకా కదులుతోంది.......అసలు ఒకటేమిటి....పాపం పండి నేరాల పుట్ట పగులుతోంది....
బస్సు యాత్రలు చేసి
సానుభూతి శునక వాలం పట్టుకుని
బురదగోదావరిని ఈదాలనుకోవటం వట్టి ప్రయాసే అని
శ్రీక్రిష్ణ జన్మస్తానానికి వెళ్ళాక కానీ భోధపడదేమో!!
Wednesday, August 17, 2011
శ్రీ రామరాజ్యం
తెలుగువారి వెండితెర వాల్మీకి బాపూ మరియూ కీ || శే|| ముళ్ళపూడి వెంకట రమణ తీర్చి దిద్దిన "శ్రీ రామరాజ్యం" చిత్రం లోని పాటలు(16) భద్రాచలం లో ఇటీవలే ఆవిష్కరించారు.
I happened to download all the songs and completed listening couple of rounds already then thought to give my review.First of all we should not compare this movie's music to the original classic "Lavakusha" because no one can reach those music standards set by Late Gantasala.
However , laya raaju ilayarajaa could succeeded in giving the music to his level best....i liked the way jonnavittula's simple lyrics synched with ilayaraajaa's soothing music.More over I actually could hear the words than music.
నాకు నచ్చినవి :
1.జగదానంద కారకా, జయ జానకీ ప్రాణనాయకా, శుభస్వాగతం ప్రియపరిపాలకా -This song is high light Of the album...am assuming its Rama's intro song.
2.సీతా రామ చరితం -song is nicely explained why war happened and how Sita brought
back to ayodhya.
3.సీతా సీమంతం -all women audience will fall for this song.
4.రామాయణము శ్రీ రామాయణము, అడుగడుగున త్యాగం, అణువణువున ధర్మము- 6:33 మిన్- this song explains all good qualities that characters has and all good human relations (తండ్రి మాట కోసం, కొడుకు తండ్రి కోసం , భార్య భర్త కోసం, తమ్ముడు అన్న కోసం ) that the story has.
5.దేవుళ్ళు మెచ్చింది, మీ ముందే జరిగింది సీతారాముల కథ-6:28 మిన్--this song tells Rama's childhood how he born and how he went to protect koushik yaaham then went to mithila to attend seetaaswayamvaram
6.గాలీ, నింగీ, నీరు, భూమీ, నిప్పూ - ఈ పాట సీతను అడవిలో దించి రమ్మని, రాముడు లక్ష్మణుణ్ణి ఆదేశించినపుడు దుఖముతో పాడే పాట ఇది.....పాత లవకుశ లో "ఎ నిమిషానికి ఎమి జరుగునో"- పాట స్తానం లో ఇది వస్తుందనుకుంటున్నాను.
7.మంగళము రామునకు - -sounded as good as other arathi songs
Rest are OK
I am sure all of the songs will be eye feasted as we already knew the Baapu style in presenting the songs on celluloid, ...Hope movie also canned with nice & tight screenplay which is very essential in this era to get successfull at boxoffice as producer spent the money lavishly and he should be safe to be able to produce the more of these films.
NOTE: No matter what the movie's result would be but I would say each and every telugite should go and watch it atleast once And I am eagerly waiting for the movie. How about you guys?
Saturday, August 13, 2011
కక్ష సాధింపు?
గతంలో మార్గదర్శి పై కోర్టు విచారణ నడుస్తున్నప్పుడు అప్పటి సియం రాజా వారిని విలేకరులు "ఈనాడు"పై కక్ష సాధిస్తున్నారా? అని అడిగినప్పుడు వారి సమాధానం: "చట్టం తన పని తాను చేసుకుపోతుంది...."
అదే రాజావారి "రాజకీయానికి" మాత్రమే వారసుణ్ణి అని [అవినీతికి మాత్రం కాదట!] ఊరూ వాడా తిరిగి చెప్పుకునే వారి పుత్రరత్నం తన ఆస్తుల పై సుప్రీం కోర్టు పూర్తి స్తాయి విచారణకు ఆదేశిస్తే అది కక్ష సాధింపు చర్యట.
ఇది కక్ష సాధింపు కాదు, చట్ట సాధింపే అని జైలుకెళ్ళాక ఏ కనిమొళో లేక రాజానో చెపితే కానీ నమ్మేలా లేడు కదూ! :-)
Saturday, August 06, 2011
Cheat sheet on Smartphone OS
Folks,
If you are in the market looking for smartphone and not sure which OS you should go to, this might little help you to narrow down the search...did not provide newbies like WebOS or Windows OS as they still babies and not ready to compete with other 3 yet.
If you are in the market looking for smartphone and not sure which OS you should go to, this might little help you to narrow down the search...did not provide newbies like WebOS or Windows OS as they still babies and not ready to compete with other 3 yet.
Android OS | BlackBerry OS(RIM) | iPhone OS | |
Phones available | Droid, Google Nexus One , HTC Hero etc | All BlackBerry phones | Apple iPhone 3G, Apple iPhone 3GS |
Pros | This is from The Google which developed Android OS has a plenty of apps (free auto navigation!) that are absent on the iPhone. Android is available on many different phones, and on all major carriers. | Its unrivaled business acumen extends from solid e-mail and messaging services to its appearance on phones with famously thumb-friendly keyboards. | Unparalleled usability and as intuitive as they come. The Apple App Store defined the field and still has the most (and the best) apps—particularly when it comes to games. |
cons | Its app store is still a distant second to the iPhone’s—particularly when it comes to games. some of apps having having issues. | . Its app store can't compete with the iPhone's. | The platform is NOT open source. Apple restricts what sort of apps developers can create for it. Minor differences aside, there is really only two vendots [ATT & Verizon)to choose from. |
Suggested | If you’re reluctant to buy into Apple’s ecosystem Android is a strong alternative. | A great choice for the business class people. | The gold choice when it comes to usability and app selection. |
Wednesday, August 03, 2011
పాకిస్తాన్ రాజకీయ రంభ!
హినా రబ్బాని ఖర్..సెలెబ్రిటి ప్రపంచం లో ఒక్కసారిగా పేలిన పాకిస్తానీ బాంబ్.అతి పిన్న వయసులోనే మంత్రి పదవి[విదేశీ వ్యహారాలు] కొట్టేసిన రాజకీయ రంభ..అదీకాక విదేశీ వ్యహారాల మంత్రిత్వ శాఖ ఒక మహిళకు దక్కటం పాకిస్తాన్ లో ఇదే ప్రథమం.లాహోర్ యూనివర్సిటి లో బి ఎస్సీ హానర్స్ చేసి, యూనివర్సిటి ఒఫ్ మసాచూసెట్స్ లో హాస్పిటాలిటి మేనేజ్ మెంట్ లో పట్టా పొందిన విద్యాధికురాలు కూడా..ఈమె ఇటీవలే శాంతి చర్చల పేరిట భారత్ సందర్శించటం జరిగింది..రాజకీయాల్లోకి వచ్చి పట్టుమని పదేళ్ళు అయినా కాకమునుపే 2008 లో టికెట్ రాని కారణంగా ఎం ఐ ఎం నుంచి పీ పీ పీ లోకి దూకేసి టికెట్ సాధించి గెలిచిన తరువాత మంత్రి కూడా అయిపోయి సమకాలీన రాజకీయాల్ని పూర్తిగా వంటపట్టించేసుకున్న నెరజాణ.
భారత్ అధికారులను కలవటానికి ముందే కాశ్మీరీ వేర్పాటు వాదులను కలవటం ద్వార ప్రోటోకాల్ నిబందనలను ఉల్లంఘించినదని ప్రతిపక్ష భాజపా నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంది ఈమె.
ఇక ఎప్పుడు ఏ "పాకీ" వాడు మనదేశానికి వస్తున్నా దుమ్మెత్తి పోసే మన జాతీయ మీడియా ఆమె అందానికి ఫిదా అయిపోయింది...చర్చల విషయాన్ని పక్కన పెట్టి రబ్బాని వేసుకున్న జ్యుల్లరీ గురించి తాను పెట్టుకున్న చలువ కళ్ళద్దాల బ్రాండ్ గురించి చేతికి తగిలించుకున్న బాగ్ గురించి వర్ణిస్తూ ఎలా తరించిపోయిందో ఈ విడియో చూస్తే మీకే తెలుస్తుంది.
భారత్ అధికారులను కలవటానికి ముందే కాశ్మీరీ వేర్పాటు వాదులను కలవటం ద్వార ప్రోటోకాల్ నిబందనలను ఉల్లంఘించినదని ప్రతిపక్ష భాజపా నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంది ఈమె.
ఇక ఎప్పుడు ఏ "పాకీ" వాడు మనదేశానికి వస్తున్నా దుమ్మెత్తి పోసే మన జాతీయ మీడియా ఆమె అందానికి ఫిదా అయిపోయింది...చర్చల విషయాన్ని పక్కన పెట్టి రబ్బాని వేసుకున్న జ్యుల్లరీ గురించి తాను పెట్టుకున్న చలువ కళ్ళద్దాల బ్రాండ్ గురించి చేతికి తగిలించుకున్న బాగ్ గురించి వర్ణిస్తూ ఎలా తరించిపోయిందో ఈ విడియో చూస్తే మీకే తెలుస్తుంది.
Subscribe to:
Posts (Atom)