"లక్కుతో శివ సినిమా తీసి "షోలే" ని చెడకొట్టి
పిచ్చి వాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మా
హిచ్చికాకు సినిమాలు చూసి దెయ్యాల సినిమాలు తీసే
రాంగోపాల్ వర్మా డైరెక్టరా కర్మా"
అని తనను తానే తిట్టుకునే [మరొకరికి తిట్టే అవకాశం ఇస్తే బూతులు తిడతారనేమో] వింతజీవి ఆర్జీవి అని మనకు తెలుసు... ఈ జీవి మొన్నామధ్య హరిహరాదులు అడ్డు వచ్చినా "బెజవాడరౌడీలు" టైటిల్ మార్చేదిలేదు అని విర్రవీగి ఇప్పుడు దాన్ని "బెజవాడ" గా మారుస్తున్నాను అని ప్రకటించి కింద పడ్డా తనదే పైచేయి అని ఎలా ట్వీటుతున్నాడో క్రింద చదవండి..
" కొన్ని కారణాల వల్ల "బెజవాడ రౌడీలు" పేరు "బెజవాడ" గా మార్చాను.కారణం ఏమిటని ఎమేమి వూహాలు చేసుకున్నా అసలు కారణం నా ఒక్కడికే తెలుసు !! "- విచిత్ర 'జీవి '
No comments:
Post a Comment