సరిగ్గా ఐదేళ్ళ క్రితం ప్రజలు తిరుగులేని అధికారాన్ని కట్టబెడితే ప్రజారంజకంగా పాలించటం చేతకాక ఊరూర తన విగ్రహలు పెట్టుకోవటానికే అధిక కాలం వెచ్చించిన మాయావతి కి ఉత్తరప్రదేశ్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు...ప్రజా సంక్షేమం మరచి దోచుకోవటమే పరమావధి గా పాలించే ఏ ప్రభుత్వానికైనా ఇదే గతి పడుతుందని మరోసారి నిరూపించారు.కులాల పరంగా ఓట్లలో భారీ చీలిక ఒక కారణం కాగా,సమాజవాది పార్టి వ్యూహత్మక వైఖరి కూడ వారిని విజయానికి మరింత చేరువ చేసింది...నిరంతరం ప్రజలలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడి 10000 కి మీ పాదయాత్ర మరో 800 రాలీలు చేపట్టి పార్టీ విజయానికి తోడ్పడిన ములాయం తనయుడు అఖిలేష్ ప్రధాన ఆకర్షణ గా నిలిచాడు ఈ ఎన్నికలలో.యాద్రుచ్చికంగా వీరి ఎన్నికల గుర్తు కూడా సైకిల్ కావటం తో ఇక్కడి తెలుగుదేశం నేతలు 2014 లో అలాంటి విజయం సాధించగలం అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం ముఖ్య పదవికోసమే పుట్టిన పార్టీ ని మరియు మంత్రి పదవి రాలేదని రాష్ట్రాన్ని విడకోట్టడం కోసమే పుట్టిన మరో పార్టీ తో పాటు అవినీతి మదగజం కాంగ్రెస్ ను మట్టి కరిపించాలి అంటే ఈ నేతలు ప్రజలకు మరింత దగ్గరవ్వాలి...సమాజవాది ని స్ఫూర్తి గా తీసుకోవాలి.