తెలంగాణా పై తాడొ పేడొ తేల్చాస్తాం అని తెగ హడావిడి చేస్తోంది కుటిల కాంగీ.దానిలో బాగంగానే రాజ్యాంగసవరణ అని కొత్త పల్లవి ఆలపిస్తున్నారు దిగ్గీ రాజా. ఆర్టికల్ 371 డి అని ఒకప్పుడు మన రాష్ట్రం కోసమే రూపొందిందట....రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నా విభజించాలన్నా ఆ ఆర్టికల్ 371 డి ని సవరించాలట.. .బీజేపీ మద్దతిస్తే సవరణ బిల్లు ఆమోదం పొందటం ప్రభుత్వానికి నల్లేరుమీద నడకే అంటున్నారు...కాని అది అంత త్వరగా జరిగే పని కాదనికూడా తెలుస్తోంది...ఇంకా యూపీయే భాగస్వామ్య పక్షాలతో మరియూ ప్రధాన ప్రతిపక్ష బీజేపీ తో సంప్రదింపుల కార్యక్రమం అంత తేలికైన పని కాదు...ఏ నిర్ణయమైనా రేపే ప్రకటించే అవకాశాలు తక్కువనే చెప్పాలి...అంటే నిర్ణయ ప్రకటన 'డిసెంబర్ 9' నాటి ప్రకటన లా కాకుండా నిదానంగా సమయం చూసి వెలువరించ వచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు...ఎందుకంటే విభజన అంటూ ప్రకటన వస్తే ఈసారి కూడా ముఖ్యమంత్రి తో సహా పార్టీలతో సంబంధం లేకుండా దాదాపు 170 మంది రాజీనామాలకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అలాగే సమైక్యం అంటె ఈసారి తెలంగాణా వాదులు కూడ అదె రాజీనామాస్త్రాన్ని ప్రయోగిస్తాని తెలుస్తోంది.తద్వార రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది అంతున్నరు.
నిర్ణయమేదైనా ఈ అనిచ్చితి కి త్వరగా తెరదించాలి...ఆ నిర్ణయం తెలుగు ప్రజలందరికీ మేలు జరిగేలా ఉండాలే కాని రాహుల్ నో మరో రత్తయ్య నో ప్రధానిని చేయటమెలాగ అనే ఆలోచనా ధోరణితో కూడి ఉండదని కోరుకుందాము...
Here is the link for full details on article 371 D
http://www.indiankanoon.org/doc/1466428/
నిర్ణయమేదైనా ఈ అనిచ్చితి కి త్వరగా తెరదించాలి...ఆ నిర్ణయం తెలుగు ప్రజలందరికీ మేలు జరిగేలా ఉండాలే కాని రాహుల్ నో మరో రత్తయ్య నో ప్రధానిని చేయటమెలాగ అనే ఆలోచనా ధోరణితో కూడి ఉండదని కోరుకుందాము...
Here is the link for full details on article 371 D
http://www.indiankanoon.org/doc/1466428/
1 comment:
తాత్సారం చేసి దాటవేయడంలో కాంగ్రెస్ అందెవేసిన చేయి!కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు!వచ్చే ఎన్నికలలో కేంద్రంలో రాబోయే కాంగ్రెసేతర పార్టీకి నిర్ణయం వదలివేసి చేతులు దులుపుకుంటుందేమో!పూర్వానుభవాన్నిబట్టి చూస్తే అట్లేఅనిపిస్తుంది!డిగ్గిరాజ రాజ్యాంగసవరణ అవసరమని కొత్తపల్లవి ఎత్తుకుంటున్నాడు!పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా ఇదేపాట పాడతాడేమో!స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణా ప్రజలను మభ్యపెట్టడానికి వేసిన కొత్త ఎత్తుగడ ఏమో ఇది!ఎవరు విప్పగలరు రాజకీయ ప్రహేళిక!ఒక్కటి మాత్రం ఘంటాపధంగా చెప్పగలం తనకు రాజకీయంగా బాగా లాభిస్తుందంటేనే కాంగ్రెస్ ఏపనయినా చేస్తుంది!లేకపోతే అలవాటుగా దాటవేస్తుంది!అది కాంగ్రెస్ రాజకీయ సలహాదారులు వ్యుహకర్తలు ఇచ్చేసలహామీద ఆధారపడి ఉంటుంది!!!!!!!!................
Post a Comment