Friday, March 14, 2008

రాబోయే ఎన్నికలలొ ఇడుపులపాయ బాట పట్టించటానికి ప్రజలు ఎప్పుడో సిద్ధమై పోయారు..

తెలుగువాడి పన్నులతో సమకూరిన నిధులతో కట్టిన విమానాశ్రయానికి తెలుగువాడైన అంజయ్యని కించపరచిన రాజీవ్ పేరా?(ఇప్పటికీ ప్రజలకి రాజీవ్ అంటే "భొఫోర్స్" అనే గుర్తుకొస్తుంది ).....నవ్వి పొదురు గాక నాకేటి సిగ్గు చందంగా ఉన్న ఈ భగవంతుడి పాలన సగటు తెలుగుపౌరుడి కి వెగటు పుట్టిస్తుంది. ఎందరో త్యాగధనులున్న తెలుగు నేల మనది.....జీవిత కాలం రాజకీయవిలువలతో బ్రతికి అవినీతి కార్యక్రమాలకి దూరం గా నిరంతరం ప్రజల మనుషులు గా మన్నన లను పొంది తెలుగు జాతి ఔన్నత్యాన్ని గౌరవాన్ని పెంచి తనువు చాలించిన తెలుగు రాజకీయ రత్నాలు మనకెన్నో ఉన్నాయి.... ఒక పింగళి వెంకయ్య (ఎర్రకోటపై గర్వం గా ఎగిరే త్రివర్ణ పతాక రూపకర్త....మరి ఈయన ఇప్పుడు ఎంతమందికి గుర్తున్నాడు)ఒక రావి నారాయణ రావు (తెలంగాణా పోరు బిడ్డ) ...ఒక సురవరం ప్రతాపరెడ్డి..రాణీ రుద్రమ....త్రిపురనేని రామస్వామి చౌధరి..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి......అల్లూరి...పుచ్చలపల్లి...టంగుటూరి...కందుకూరి.....నందమూరి తారక రాముడు....పాములపర్తి నరశింహుడుఇలా ఈ చిట్టా పెరిగిపొతూంది...వీళ్ళెవరూ పనికి రాక పోవటానికి కారణం అందరికీ తేటతెల్లమే....తెల్ల దొరసాని మెప్పు కోసం, తమ కుర్చీ కాపాడుకోవటనికి తెలుగుప్రజల తో ముడిపడి ఉన్న తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు.... ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేకపోవటానికి కారణం మన మధ్య అయిక్యథ లేకపొవటమే.... అసలు ఆ మాటకొస్తే దేశంలొ ఏ విమానాశ్రయానికి కూడ స్తానికేతరుల పేర్లు లేవు...ముంబై - చథ్రపథి శివాజి పేరు,కొల్కొత - నేతాజి పేరు,చెన్నై - అన్నదురై పేరు,ఆహ్మదబద్-పటెల్ పేరు,భువనెశ్వర్ - బిజు,నాగ్పూర్ - అంబేద్కర్ పేరు,ఇండోర్ - అహల్యా భాయి పేరు,గౌహతి-గోపీనాథ్ పేరు...ఇలా అందరూ స్థానికులే....మనమీదే ఇలా పేర్లు రుద్దబడుతున్నాయి. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతొ వారి పాలనకి వారే మరణశాసనం రాసుకుంటున్నారు.....చరిత్ర లో హిట్లర్, నీరో లాంటి నియంతలే ప్రజాగ్రహానికి మాడి మసై కాలగర్భంలో కలిసిపోయారు ......నా కోప నరం ఎప్పుడో తెగిపోయిందని రోజూ ఆగ్రహంగా అస్సెంబ్లీ లో ఊగిపోతూ చెప్పే ఈ పిల్ల నియంతను రాబోయే ఎన్నికలలొ ఇడుపులపాయ బాట పట్టించటానికి ప్రజలు ఎప్పుడో సిద్ధమై పోయారు.. కాకపోతే అవినీతి కూపం లొ కూరుకు పోయిన ఈ గుడ్డి ప్రభుత్వం ఆ విషయం గ్రహించే స్పౄహ లో లేదంతే.

5 comments:

Viswanadh. BK said...

బ్లాగులు గానీ వాటి పాఠకులుగానీ పరిమితము గనుక మరికొంత సైన్యమును సమకూర్చుకొని ఉద్యమిద్దాం అప్పటి వరకూ కత్తులకు{కీబోర్డు కలాల}సానబెట్టే పని కంటిన్యూ చేద్దాం.
ఏమంటారు?.....

Burri said...

బాగుంది కాని.. ఒకటి మాత్రమ్ నిజం, కాంగ్రేస్ వాళ్లు పేర్లు మాత్రమే పెట్టుకోన్నారు, తెలుగు దేశం వాళ్లు మంచి కలర్ (అయిల్) ప్రిటింగ్ పోస్టరులు (మామను త్రోకి పైకి వచ్చిన అల్లుడు పోటో) పెటినారు. ఆది ఎప్పుడు కరువుకాలంలో (నా 25 ఏళ్ల లో చూసిన కరువు). పేరు ఎప్పుడైన మార్చుకోవచు కాని అయిల్ ప్రిటింగ్ లకు పెట్టిన మనీ తిరిగి రాదు. నీవు 25 పధకాలకు ఇందిర్మ పేర్లు మాత్రమే చూచినారు, నేను 25 పధకాల ఉపయెగం గురించి చెప్పమటున్నాను. ఈపనులు తెలుగు దేశం వాళ్లు (9 ఏళ్ల కాలం లో) చేసి ఉంటే కాంగ్రేస్ వాళ్లుకు ఛాన్స్ వచ్చేది కాదు. పోరాడితే పోయేది ఏమీలేదు.. కాని ..గుడ్డిగా (CPM కార్యకర్తలు లగా) ఫాలో అవకూడదు. తప్పు ఒప్పులు కూడా చూడాలి. ఏమైనా తప్పులు వుంటె క్షమించగలరు.

Anonymous said...

బాబు చేయనిది కాంగిరేసు వాళ్ళు ముందే చెసివుంటే(40 సంవత్సరాలలో)అసలు తెలుగుదెశమే పుట్టివుండేదిగాదు.మన రాజు గారు కూడా పీవీ పై రాళ్ళేసే పైకొచ్చాడు.అయినా 40 సంవత్సరాలలో కానిది 9 ఏళ్ళలో కావాలనుకొవటమూ అన్యాయమే. కొన్ని రంగాలకి అన్యాయము జరిగినా రాష్ట్రనికి ఒక విధమైన గౌరం తెచ్చింది తెలుగుదెశమే.ఇప్పుడు ఒక్కో రంగాన్ని సంపాదన మాత్రమే తెలిసిన తుగ్లక్లు ఏలుతున్నరు.క్షమించాలి....

Bujji said...

అవును విశ్వనాథ్ గారు....ఇలాంటి ఉద్యమాలకి అక్షరాయుధాలు అందివ్వటం ద్వారా మనవంతు సహకారం అందించుదాం.
9 ఏళ్ళ పాలన లో చేసిన తప్పుల కారణం గానే ఇప్పుడు వారు ప్రతిపక్షం లో కూర్చుంటున్నారు....ప్రస్తుత పాలకులు అలాంటి తప్పులు చెయ్యం అని ఊరు వాడ పాదయాత్రలు చేసి ప్రజలకి హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కారణం గా ప్రశ్నించ వలసి వస్తుంది.....కాని వీరు వారి తప్పులని కొనసాగిస్తాం అంటున్నప్పు డే సమస్య వస్తుంది...పాలించిన అయిదేళ్ళూ గత 9 ఏళ్ళపాలనను విమర్శిస్తూ పోతే ఇక మీరు ప్రజలకి మంచి చేసేదెప్పుడు.? క్షమించాలి ఇలా అడుగుతున్నందుకు

Anonymous said...

ప్రభుత్వం ఏదయినా గాని ప్రతి కార్యానికి శాస్త్రీయత ని జొడించాలి! అందులో ప్రజాబిప్రాయం చాలా ముఖ్యం.
కాంగ్రస్ హయాంలలో గనక చూస్తే నెహ్రూ, ఇందిర, రాజీవ్, గాందీలు కాని గాందిలు గా ప్రజలు చెవి లొ పూలు పెట్టి వాళ్ళ రాజ్యాన్ని కొన్సగిస్తునారు. ప్రజలు మేలుకోవాలి! వ్యక్తి పూజలని మానాలి. "తన" నుండి "మన" కి ఎదగాలి! అప్పుడే ప్రజాస్వామ్యం వచ్చేది.