Thursday, September 16, 2010

పడమటి సంధ్యారాగం హీరో ఇప్పుడు ఎమి చేస్తున్నాడు?

1986 లో విడుదలై విజయం సాధించిన తెలుగు చిత్రం "పడమటి సంధ్యారాగం" సినిమా లో "సాంధ్య! నేను.. అందంగా..చచ్చానా?" అని వచ్చీ రాని తెలుగులో మాట్లాడి మన అందరినీ అలరించిన హీరో టాం [అసలు పేరు తామస్ జేన్ ఈలియట్ లెండి] గుర్తున్నాడు కదా! సినిమా విజయం సాధించినా అతని గురించి తెలుగు పత్రికలోనూ ప్రచురించినట్లు గాని చదివినట్లు గాని నా వరకూ తెలియదు... మధ్య నే సినిమా మరో సారి చూస్తున్నప్పుడు ఇతని గురించి మనమే కొన్ని విషయాలు తెలుసుకుని బ్లాగితే ఎల వుంటుందా అనే అయిడియా వచ్చింది.. ఆలోచనకి ప్రతిరూపమే వ్యాసం.
మైకెల్ మరియూ సింతియా దంపతులకు జనవరి 19, 1969 లో బాల్టిమోర్ నగరం, మేరిలాండ్ రాష్ట్రం లో జన్మించిన టాం వారి ఆరుగురు పిల్లలలో ఒకడిగా పెరిగాడు.1986 లో పడమటి సంధ్యారాగం ప్రొడ్యూసర్స్ పరిచయం కావటం తొ అతని 17 ఏళ్ళ వయసులో "తామస్ స్ప్రిగ్ వుటన్",మేరిలాండ్ హై స్కూల్ వదిలేసి అమెరికా రోమియో & తెలుగు జూలియట్ కథ తో తయారైన "పడమటి సంధ్యారాగం" సినిమా లో నటించటానికి ఒప్పుకోవటం జరిగింది. సినిమా ప్రజాదరణ పొందటం తొ మంచి భవిష్యత్ కనపడుతున్నా, సొంత గడ్డ పై ఉన్న మమకారం తో, లాస్ ఏంజిలెస్ వెళ్ళిపోయి తిరిగి తన నటనకు మెరుగులు దిద్దుకోసాగాడు.
ప్రస్థానం లో ఎన్నో ఒడిదుకులు కూడా ఎదుర్కున్నాడు..డబ్బులు కోసం వీధి నాటకాలు వేస్తూ, పార్కుల్లోని బెంచీల పై నిద్రిస్తూ ఎన్నో రాత్రులు గడిపాడు.ఒక దశ లో గ్రుహ వసతి లేని వారి చిట్టా లో కూడా నమోదు చేసుకోవలసి వచ్చింది.సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ ఇలాంటి వారికి ఆహారం సమకూరుస్తుంది.అలా వారు సమకూర్చిన ఆహారం తో బ్రతుకు వెళ్ళబుచ్చుతూ అవకాశాల వేట మాత్రం ఆపలేదు.నెమ్మదిగా చిన్న చిన్న కంపెనీల నుంచి చిన్న చితకా అవకాశాలు రావటం మొదలైంది.క్రమేపీ వాణిజ్య ప్రకటనలు లో అవకాశాలు రావటం , వాటిలొ నటిస్తూండగానే 1992 లో "బఫ్ఫి వాంపైర్" లొ ఒక చిన్న పాత్ర లభించింది.దీని తరువాత "నెమెసిస్"(1993)అనే మాస్ మసాల చిత్రం లో చేసాడు.1996 లో వచ్చిన "గ్రౌండ్ జీరో" అనే సినిమాలో అతని భవిష్య భార్యామణి ఐషా హౌర్ తొ కలిసి నటించాడు [ప్రస్తుత భార్య పెట్రిషియా అనుకోండి, కానీ ఇది కూడ విడాకులకు దారి తీస్తుందని విన్నాను].
ఇన్ని చేసినా 1997 లో వచ్చిన "ఫేస్ ఆఫ్" మాత్రమే అతని ఫేస్ వాల్యూని కొంచం పెంచింది..ఇందులో నికొలస్ కేజ్ తో నటించే అవకాశం కూడా వచ్చింది అతనికి.పూర్తిస్తాయి హీరో అవకాశం వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమా మాత్రం "డీప్ బ్లూ సీ" (1999). సినిమా అత్యంత ప్రజాదరణ పొంది అతనికి మంచి గుర్తింపు తెచ్చినా చాలా కాలం అతిధి పాత్రలు సహాయక పాత్రలతో సరిపెట్టుకోవలసి వచ్చింది...
వెండి తెరపై అంతగా రాణించక పోయినా బుల్లి తెర బాగానే కరుణించినట్లుంది....2009 లో హెచ్ బి చానల్ "హంగ్" అని ఒక ఆంగ్ల ధారావాహిక కోసం టాం ని బుక్ చేసుకుని ప్రసారం చేయటం జరిగింది....అమెరికా లో '' రేటెడ్ టీవి ఫ్లిక్ కు వచ్చినంత ప్రజాదరణ మరి దేనికీ రాలేదు...టాం కి హాట్ హీరో క్రేజ్ తొ పాటు హెచ్ బి చానల్ కి టి ఆర్ పి రేటింగ్స్ మరియూ సబ్ స్క్రిప్షన్స్ అమాంతం పెరిగి పోయాయట.బహుశా ఇక మన క్రిస్ [తెలుగు సినిమాలో అతని పేరు] అదేనండీ టాం బుల్లి తెరకే పరిమితమైనా అయిపోవచ్చు...ఏది ఏమైనా ఎంతటి ఒడుదుడుకులకు లోనైనా ఆత్మస్తైర్యం కోల్పోకుండా తానెంచుకున్న రంగంలోనె ద్రుఢ చిత్తం తో వెండి తెరా బుల్లి తెరా అని చూసుకోకుండా ముందుకు సాగుతున్న ఇతని కథ స్పూర్తిదాయకం అనిపిస్తూంది కదూ!! ప్రతి రంగం లో ఇలా కష్టాలు పడి పైకొచ్చిన వారున్నా, హాలివుడ్డా లేక బాలివుడ్డా, మాలివుడ్డా లేక టోలివుడ్డా అని తేడా లేకుండా సినీ రంగం లో సంఖ్య కాస్త ఎక్కువే అని చెప్పాలి.
ఒక సందర్బం లో ఇండియన్స్ గురించి ఇలా వ్యాఖ్యానించాడు:

"I still have a real soft spot for everything Indian. India opened up my eyes to the world in a way no other experience could have. It’s the opposite of the western world. Their values are put less on the material things and more on the spiritual things of life. Being in India gave me a perspective that material things are not the end-all, be-all of what life is about… I was shown the light in India… It gave me the strength and wisdom to overcome a lot of rejection""



2 comments:

Anonymous said...

nice research

voleti said...

Very good.. keep it up..