Thursday, July 11, 2013

కాంగీ కొత్త తెలం 'గానం'- రాజ్యాంగసవరణ

తెలంగాణా పై తాడొ పేడొ తేల్చాస్తాం అని తెగ హడావిడి చేస్తోంది కుటిల కాంగీ.దానిలో బాగంగానే రాజ్యాంగసవరణ అని కొత్త పల్లవి ఆలపిస్తున్నారు దిగ్గీ రాజా. ఆర్టికల్ 371 డి అని ఒకప్పుడు మన రాష్ట్రం కోసమే రూపొందిందట....రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నా విభజించాలన్నా ఆ ఆర్టికల్ 371 డి ని సవరించాలట.. .బీజేపీ మద్దతిస్తే సవరణ బిల్లు ఆమోదం పొందటం ప్రభుత్వానికి నల్లేరుమీద నడకే అంటున్నారు...కాని అది అంత త్వరగా జరిగే పని కాదనికూడా తెలుస్తోంది...ఇంకా యూపీయే భాగస్వామ్య పక్షాలతో మరియూ ప్రధాన ప్రతిపక్ష బీజేపీ తో సంప్రదింపుల కార్యక్రమం అంత తేలికైన పని కాదు...ఏ నిర్ణయమైనా రేపే ప్రకటించే అవకాశాలు తక్కువనే చెప్పాలి...అంటే నిర్ణయ ప్రకటన 'డిసెంబర్ 9' నాటి ప్రకటన లా కాకుండా నిదానంగా సమయం చూసి వెలువరించ వచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు...ఎందుకంటే విభజన అంటూ ప్రకటన వస్తే ఈసారి కూడా ముఖ్యమంత్రి తో సహా పార్టీలతో సంబంధం లేకుండా దాదాపు 170 మంది రాజీనామాలకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అలాగే సమైక్యం అంటె  ఈసారి తెలంగాణా వాదులు కూడ అదె రాజీనామాస్త్రాన్ని ప్రయోగిస్తాని తెలుస్తోంది.తద్వార రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది అంతున్నరు.

నిర్ణయమేదైనా ఈ అనిచ్చితి కి త్వరగా తెరదించాలి...ఆ నిర్ణయం తెలుగు ప్రజలందరికీ మేలు జరిగేలా ఉండాలే కాని రాహుల్ నో మరో రత్తయ్య నో ప్రధానిని చేయటమెలాగ అనే ఆలోచనా ధోరణితో కూడి ఉండదని కోరుకుందాము...

Here is the link for full details on article 371 D
http://www.indiankanoon.org/doc/1466428/

Saturday, June 08, 2013

పెను "అవినీతి తుఫాను" తలొంచి చూసిన తొలి నిప్పు కణం అతడే !!

సి బి ఐ జేడి లక్ష్మీనారాయణ...పెను "అవినీతి తుఫాను" తలొంచి చూసిన తొలి నిప్పు కణం !!
"అవినీతి అధికారులు" అనే గంజాయి వనంలో తులసి మొక్క వంటివాడు! ఫాక్షనిస్టుల బెదిరింపులుకి అదరక బెదరక, మరెన్నో వత్తిళ్ళు తట్టుకుని,కార్పోరేట్ అవినీతి దిగ్గజాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన అధికార యోథుడు..  సి బి ఐ అంటే "కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్" అని ముద్ర పడిన ఈరోజుల్లో రాష్ట్రంలో దాని ప్రతిష్టని మరింత పెంచి ఆ పదవి కే వన్నె తెచ్చిన ఉత్తమ ఉన్నతాధికారి.ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా మరెన్నో శాపనార్ధాలు పెట్టినా తొణకకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు.దేశానికి ఇప్పుడు ఇలాంటి అధికారుల అవసరం ఎంతైనా ఉంది.
పదవీ కాలం ముగియటం తో ఇతన్ని మహారాష్ట్ర కి బదిలీ చేసిన సందర్భంగా ఒక విద్యాసంస్థ సన్మాన సభలో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ చక్కటి తెలుగులో సాగిన అతని ప్రసంగం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.

మీ కోసం యూ ట్యూబ్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను:

Friday, January 11, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు !!

కుటుంబ నేపథ్యం లో ఉన్నతమైన కుటుంబ విలువలతో భావోద్వేగాల నడుమ సున్నితమైన మానవ సంబంధాలపై చిత్రీకరించిన ద్రుశ్య కావ్యం.దాదాపు 25 సంవత్సరాల నాటి  కథనా విధానం తో, డిజైనెర్ కత్తి రక్తవిన్యాసాలకి & వెటకారమై పోయిన హాస్యానికి అలవాటు పడిన ప్రేక్షకులను 2.30 గం కూర్చోపెట్టటం అంటే ఏ దర్శకుడికైనా కత్తి మీద సామే.ఆ దిశగా దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి.

చిత్రం లో మెచ్చుకోతగిన అంశాలు మచ్చుకి కొన్ని:
  • హింస,రక్తపాతాలకి తావు ఇవ్వక పోవటం
  • అన్నదమ్ముల మద్య చోటుచేసుకున్న భావోద్వేగాలు
  • సీత పాత్రని తీర్చి దిద్దిన విదానం
  • కొడుకు తండ్రితో మాట్లాడే పద్దతి [మహేష్ మాత్రమే..కథాపరంగా వెంకటెష్ తండ్రితొ సినిమా అంతా మాట్లాడడు] 
  • వెకిలి మాటలకి వెటకారాలకి చోటివ్వక పోవడం
  • సినిమా చివరిలో కథానాయకులు వారి వారి ప్రవర్తనా తీరు పై ఒకరికొకరు పశ్చాతాపం తెలుపుకోవటం
  • మన జీవితంలో నవ్వుకి ఎంత ప్రాముఖ్యత శక్తి ఉన్నాయో చాటి చెప్పటం.
ఇదే సినిమా పై ఇతరుల అభిప్రాయలు కూడా చదవండి:
బాగుంది కాని కమెడీ ఉంటే ఇంకా బావుండేది
నచ్చలేదు
సుత్తి
బోరింగ్
సాగదీసాడు
కామెడీ లేదు