Sunday, September 28, 2014

కీర్తి శేషులు శ్రీ పింగళి వెంకయ్య గారు

2014 ఆగస్ట్ 14వ తారీకున ఒక తెలుగుస్వాతంత్ర్య సమరయోధుడికి ఘనమైన నివాళి దక్కింది...ఇదివరకెన్నడూ దక్కనిది..ఆ తెలుగువాడు ఎవరో కాదు...ప్రముఖ గాంధేయవాది, గొప్ప దేశభక్తుడు, రచయిత కీర్తి శేషులు శ్రీ పింగళి వెంకయ్య గారు...ఆయనే మన జాతీయ జెండా రూపకర్త..1921 మార్చ్ 31 - ఏప్రిల్ 1 తేదీలలో విజయవాడలో మహాత్మా గాంధి అధ్యక్షతన జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం లో ఎకగ్రీవంగా జతీయ జెండాగా ఆమోదించబడినది అని చరిత...కానీ ఈ విషయం చాల కొద్దిమంది తెలుగువారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ విషయానికి జాతీయస్థాయిలో పెద్దగా ప్రాచుర్యం లేకపోవటమే..ఒక "తెలుగువాడు" జెండా రూపకల్పన చేసాడు అని వుంది అంట కాని ఆ తెలుగువాడి పేరు మాత్రం లేదట ఎక్కడా..ఈ మువ్వనెల జెండా ఎర్రకోట పై సగర్వంగా ఎగురుతుంటే చూడలి అని వెంకయ్య చివరికోరిక అట. కాని ఆర్థిక పరిస్థితులకారణంగా ఆయన కుటుభం ఢిల్లీ చేరుకోలేకపోయిందట అప్పట్లో.  దీనిని మన కేంద్ర మానవవనరుల అభివ్రుద్ధి శాఖామాత్యులు శ్రీమతి స్మ్రుతి ఇరాని గుర్తించి అయన పేరిట "తిరంగీ మలహర్ " అని ఒక శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు...[వందేమాతరం గీతాన్ని 3 మలహర్ రాగాలలో ఆలపించారట .ఈరాగానికి మేఘాలు వర్షించేవని ప్రతీతి].
అంతటితో చేతులు దులిపేసుకోకుండా, ఆయన జీవిత విశేషాలతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలలలో పాఠ్యాంశంగా చేర్చబోతున్నారు..మోడి ప్రభుత్వం రాకతో ఢిల్లీ లో తెలుగువాడికి పూర్వవైభవం వస్తోంది అనేభావన కలుగుతోంది ఇప్పుడు.
మన ఆంధ్రా ప్రభుత్వం కూడా విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరుపెట్టి జాతికి పునరంకితం 
చేసింది ఈరోజు.

http://www.youtube.com/watch?v=PR5NrKBSKKM
2014 ఆగస్ట్ 14వ తారీకున ఒక తెలుగుస్వాతంత్ర్య సమరయోధుడికి ఘనమైన నివాళి దక్కింది...ఇదివరకెన్నడూ దక్కనిది..ఆ తెలుగువాడు ఎవరో కాదు...ప్రముఖ గాంధేయవాది, గొప్ప దేశభక్తుడు, రచయిత కీర్తి శేషులు శ్రీ పింగళి వెంకయ్య గారు...ఆయనే మన జాతీయ జెండా రూపకర్త..1921 మార్చ్ 31 - ఏప్రిల్ 1 తేదీలలో విజయవాడలో మహాత్మా గాంధి అధ్యక్షతన జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం లో ఎకగ్రీవంగా జతీయ జెండాగా ఆమోదించబడినది అని చరిత...కానీ ఈ విషయం చాల కొద్దిమంది తెలుగువారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ విషయానికి జాతీయస్థాయిలో పెద్దగా ప్రాచుర్యం లేకపోవటమే..ఒక "తెలుగువాడు" జెండా రూపకల్పన చేసాడు అని వుంది అంట కాని ఆ తెలుగువాడి పేరు మాత్రం లేదట ఎక్కడా..ఈ మువ్వనెల జెండా ఎర్రకోట పై సగర్వంగా ఎగురుతుంటే చూడలి అని వెంకయ్య చివరికోరిక అట. కాని ఆర్థిక పరిస్థితులకారణంగా ఆయన కుటుభం ఢిల్లీ చేరుకోలేకపోయిందట అప్పట్లో. దీనిని మన కేంద్ర మానవవనరుల అభివ్రుద్ధి శాఖామాత్యులు శ్రీమతి స్మ్రుతి ఇరాని గుర్తించి అయన పేరిట "తిరంగీ మలహర్ " అని ఒక శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు...[వందేమాతరం గీతాన్ని 3 మలహర్ రాగాలలో ఆలపించారట .ఈరాగానికి మేఘాలు వర్షించేవని ప్రతీతి].
అంతటితో చేతులు దులిపేసుకోకుండా, ఆయన జీవిత విశేషాలతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలలలో పాఠ్యాంశంగా చేర్చబోతున్నారు..మోడి ప్రభుత్వం రాకతో ఢిల్లీ లో తెలుగువాడికి పూర్వవైభవం వస్తోంది అనేభావన కలుగుతోంది ఇప్పుడు.
మన ఆంధ్రా ప్రభుత్వం కూడా విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరుపెట్టి జాతికి పునరంకితం
చేసింది ఈరోజు.

Wednesday, May 28, 2014

Grand Tributes to Legend NTR on his 91st Birthday


మహానాడు !! తెలుగు తమ్ముళ్ళకి ఇది మరో సంక్రాంతి లాంటిది!! ఎందుకంటే ఈరోజు తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు,గౌరవనీయులైన శ్రి నందమూరి తారకరామారావు 91 వ జన్మదినం కూడా...అందునా 10 సం సుదీర్ఘ విరామం తరువాత అధికారం ప్రాప్తించిన సం లో వచ్చిన పండగ.అందుకే అంచనాలకి మించి 70 వేలు కి పైగా హాజరైనట్లు సమాచారం. మరో 20 వేలు ట్రాఫిక్ లో చిక్కుకుని వెనుతిరిగినట్లు చెపుతున్నారు...యువ ఉపన్యాసకుల్లో జయ నాగేశ్వరరెడ్డి [దివంగత బీవీ మోహన్ రెడ్డీ తనయుడు..ఈయన జోస్యాలు నిజమయ్యేవి అంటారు]  , రేవంత్ రెడ్డి , కింజారపు రామ్మోహన్ నాయుడు [దివంగత ఎర్రన్నాయుడు తనయుడు]  & లోకేష్ ఆకట్టుకున్నారు. గత పదేళ్ళుగా తల్లీ పిల్ల కాంగ్రెస్ దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎన్నికలను ఎదుర్కొని పార్టీని అధికారంలో కి తెచ్చిన కార్యకర్తలకి దన్నుగా నిలవాల్సిన అవసరం పై వీరు ప్రసంగించిన తీరు ఆకట్టుకుంది.

తీర్మానాలు:

  • ఎన్ టీ ఆర్ కి భారత రత్న ఇవ్వాలి
  • అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ విభాగానికి ఎన్ టీఆర్ పేరు పెట్టటం [అప్పట్లో మహా 'మేత' రాజశేఖర్ రెడ్డి,  తెదేపా చేసిన అభ్యర్దనని తోసిపుచ్చారు]
  • జాతీయ పార్టీ గా తెదేపా
  • 20 కోట్ల తో కార్యకర్తల సంక్షేమానికి నిధి 

Saturday, May 17, 2014

సీమాంధ్రకి పసుపు తిలకం !! ఒకే దెబ్బకి రెండు 'తల్లీ పిల్ల 'కాంగ్రెసులు !!!


Mission accomplished...TDP returned to power when INDEED....జనసునామీ ముందు ఫాను గాలి తుస్సు !! ఒక దెబ్బకి రెండు తల్లీ పిల్లల పార్టీలకి చావు దెబ్బ.can't thank enough TELUGU WARRIORS who voted first time for themselves and CONGRATULATIONS to CBN, MODI ,PAVAN & BALAIAH, LOKESH and last but not least,TARAKA RATNA/NARA ROHIT/ALI/VENUMADHAV . Also appreciate the BRING BACK BAABU team for thier efforts.!!! And lot of other known and unknown teams put lot of efforts as well...ఈ విజయం తెలుగోడిది..ఈవిజయం అపూర్వం అపురూపం..you know what? Now I can answer the question "who is your chief minister?" proudly.
అన్నగారు స్వర్గీయ శ్రీ ఎన్ టీఆర్ కి ఇంతకంటే ఘనమైన నివాళి ఏముంటుంది !!!!!
Though, SAD to see these clean leaders GO:
రావి వెంకటేశ్వరరావు [గుడివాడ,రావి శొభనాద్రి చౌదరి కుమారుడు.ఇక్కడ మనం ఒకటి గుర్తుచేసుకోవాలి. గత ఎన్నికలలో జూనియర్ ఎన్ టీ ఆర్ నాని కి టికెట్ సిఫార్సు చేయటంవల్ల, అధిష్టానం ఈయనకి టికెట్ ఇవ్వలేక పోయింది.చేసేది లేక పీఅర్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు గెలిచిన నాని ఆతరువాత వైకాపాకి అమ్ముడుపోయారు [30 కోట్లు?].ఈ ఎన్నికలలో రావి తిరిగి సొంతగూటికి చేరి అదే నాని పై పోటీ చేసినా, ఈలోపు కాడర్ అంతా చెల్లాచెదురు అయిపోయి,  మళ్ళీ ఓడిపోయారు. ఒక రకంగా జూనియర్ ఈయన రాజకీయపతనానికి పరోక్షంగా కారణం అయ్యాడని చెప్పుకోవచ్చు..తాత పార్టీ కి ప్రచారం చేయటం నా భాధ్యత అని పదే పదే మైకులు ముందు చెప్పి, అదే తాతపార్టీ గెలుపు చారిత్రక అవసరమైన వేళ "అంతఃపురాని"కే పరిమితం కావటం అతను చేసిన చారిత్రిక తప్పిదమే కాదు...ఆ తాతకు మనవడిగా అతి భాధ్యతారాహిత్యం కూడా!! నటుడు గా ఆయన్ను అభిమానించే సగటు తెలుగుదేశాభిమానులు ఇది జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడో?]
పయ్యావుల కేశవ్ [ఉరవకొండ , సమైక్యాంధ్ర కోసం గట్టిగా పోరాడిన యువనేత] 
గాలి ముద్దుకృష్ణమనాయుడు[నగరి, ప్రత్యర్థి రోజా]
యనమల రామకృష్ణుడు [తుని]
ప్రతిభా భారతి [రాజాం, మాజీ స్పీకర్] 
సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి[సర్వేపల్లి]
గంజి చిరంజీవి [మంగళగిరి, 12 వోట్ల స్వల్ప తేడాతో ఓటమి ]

GLAD to see these people GO:
వైఎస్ విజయమ్మ [పట్టణ ప్రాంతాల్లో మోడీ గాలి బలంగా వీస్తుంది అని తెలిసీ , తల్లిని వైజాగ్ లో నిలపడం ద్వారా కన్న కొడుకే ఆమె ఓటమి కి కారణం అయిన చరిత్ర]
అంబటి రాంబాబు [సత్తెనపల్లి లో కోడెల ప్రత్యర్థి, టీవీ మైకు ముందు ఉత్తమ అసందర్భ ప్రేలాపి]
అయోధ్య రామిరెడ్డి [నర్సరావు పేట, గజన్ జైలు మేటు]
కోనేరు ప్రసాద్ [గజన్ జైలు మేటు & మా విజయవాడ పార్లమెంటరీ టీడీపీ ప్రత్యర్థి ]
కొలుసు పార్థసారథి [బందరు వైకాపా, ఈయనకు జైలు శిక్ష కూడా పడింది ]
బాలశౌరి [గజన్ క్విడ్ ప్రోకో మేట్]
వంగవీటి రాధ [విజయవాడ లో టీడీపీ చిరకాల & సంప్రదాయ ప్రత్యర్థి]
ధర్మాన సోదరులు [గజన్ జైలు మేటు]
నవీన్ నిశ్చల్ [బాలక్రిష్ణ ప్రత్యర్థి]
జోగి రమెష్ [ మా అసెంబ్లి నియోజకవర్గం అయిన మైలవరం]
నల్లపురెడ్డి ప్రసన్నకుమర్ రెడ్డి [కోవూరు]
దుట్టా రామచంద్ర రావ్ [గన్నవరం వంశీ ప్రత్యర్థి]
బాలినేని [ఒంగోలు వైకాపా]
బొత్స సత్తి
రఘువీర [పీసీసి]






జై తెలుగుదేశం! జై తెలుగునాడు!! జైహింద్ !!!

Wednesday, May 07, 2014

Huge VOTER turnout !!!

80% పోలింగ్ దేనికి సంకేతం ? ఆభివ్రుద్ధి కి వోటు పోటెత్తిందా? సీమాంధ్ర పౌరుషం ఉవ్వెత్తున ఎగసిందా? 
సీమాంధ్రుడి ఆగ్రహజ్వాలల్లో విభజన, కుట్ర, అవినీతి రాజకీయాలు మాడి మసై పోయి అభివ్రుద్ధి రాజకీయం పునీతం కానుందా? 
ఆంధ్రుడి తీర్పు ఎప్పుడూ విస్పష్టమే...ఏ ఎన్నికలైనా సంపూర్ణ అధికారమివ్వటమే అలవాటు...తెలుగునాట సంకీర్ణానికి తావులేదు..వోటింగ్ శాతం పరిశీలిస్తే అదే జరగబోతోంది అనిపిస్తోంది. మే 12న వెలువడే స్థానిక ఎన్నికల ఫలితాలతో ప్రజల మొగ్గు ఎటు ఉందో కొంతవరకు తెలిసినా అసలు ఫలితాల కోసం మే 16 వరకు నిరీక్షణ తప్పదు.

కానీ, మన ఘనతవహించిన గవర్నరు గారు మాత్రం ఈ క్రింది ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పగలగాలి !! 
1. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా ఈవిఎంలు ఒకే రీతిలో ఒకే సమయంలో ఎందుకు మొరాయించాయి ? 
2.ప్రజలపై, మీడియా పై వైకాపా గూండాలు దాడులకి తెగబడుతుంటే పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు?
3.కల్తీ మద్యం దొంగ నోట్లు పంచిన సంఘటనల్లో ఎన్ని కేసులు నమోదు చేసారు?

Saturday, May 03, 2014

వైకాపా హఠావ్..సీమాంధ్ర బచావ్!!! indeed & apt slogan with rhetoric voice !!

వైకాపా హఠావ్..సీమాంధ్ర బచావ్!!!
ఈ పవన్నినాదం ఇప్పుడు సీమాంధ్ర లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర/గోదావరి జిల్లాల్లో సునామి శ్రుష్టిస్తోంది...దీంతో ఒకప్పుడు తెలుగుదేశానికి అండగా నిలబడిన ఒక బలమైన సామాజక వర్గం మళ్ళీ చేరువయ్యే అవకాశం...అదేవిధంగా కోస్తా లో ఎప్పుడూ నిప్పూ ఉప్పులాగ ఉండే రెండు ప్రధాన వర్గాలు మధ్య సుహ్రుధ్బావ వాతావరణం నెలకొనవచ్చు.. అనుకూల 'పవనా'లతో అనేక నియోజకవర్గాలలో  సైకిల్ బుల్లెట్ లా దూసుకెల్తోందని సమాచారం..ఈ పరిణామలతో వైకాపా దొంగల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి..దిక్కుతోచక రాష్ట్రమంతా తెలుగుదేశం అభ్యర్దుల పై,  వారి సభలకు వచ్చే జనం పై వైకాపా గూండాలు దాడులకి తెగబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి...పవన్ ఇంత ఆవేశంగా వైకాపాని టార్గెట్ చేస్తాడని ఊహించని ఆ పార్టీ, ఎవరు అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినా వివరణ ఇవ్వకుండా ఎదురుదాడి చేసినట్లే, అతన్ని కూడా టార్గెట్ చేసి నమో & నారాలకి అమ్ముడు పోయావని దుమ్మెత్తి పోస్తుంది!! ( ఒకవేళ నిజంగానే అమ్ముడుపోయాడని అనుకున్నా, దొంగల చేతికి రాష్ట్ర పాలనా పగ్గాలు వెళ్ళకుండా వుండే అవకాశం ఉంది కద..అయినా నవ్యాంధ్రప్రదేశ్ అనే శిశువు ఈ కసాయోళ్ళ పాలవకుండా కాపాడ్డానికి పవన్ లాంటోళ్ళు ఎంతమంది అమ్ముడుపోయినా, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకునేవాళ్ళు వాళ్ళని కొనుక్కున్నా తప్పేంటి!)
ప్రజల ఆస్తులను ఎర గా వేసి తండ్రి అధికార అండ తో నొక్కేసిన అవినీతి డబ్బుతో ఇప్పుడు అదే ప్రజల వోట్లని కొనడానికి విచ్చలవిడిగా వెదజల్లుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఇలా ఎన్ని అడ్డదారులు తొక్కినా , మొన్న వాళ్ళ తాబేదారు చానల్ ఎన్ టీవి తో పాటు, ఇప్పుడు లగడపాటి సర్వే లు [ వాస్తవాలకు దగ్గరగా ఉంటాయని అంటారు] కూడా సీమాంధ్ర లో తెదేపా దే అధికారం అని తేల్చేయటంతొ గజన్ బాచ్ గంగవెర్రులెత్తి పోతున్నారు.
తెలుగుదేశం...ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మదరాసీలు గా పిలువబడుతున్న తెలుగుజాతి కి దేశంలో గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ...తెలుగు రాష్ట్రానికి ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్తానాన్ని సంపాదించి పెట్టిన పార్టీ. ఎంతోమంది రాజకీయ నాయకులని రాష్ట్రానికి అందించిన పొలిటికల్ ఫాక్టరీ..ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల ముందు వరుసలో ఉన్న నాయకులందరినీ తెలుగుదేశమే తయారుచేసింది అంటే అతిశయోక్తి కాదు...అటువంటి ఘనమైన చరిత్ర ఉన్న పార్టీ ఇప్పుడు ఒక 420 పార్టీ తో తలపడాల్సి రావటం పార్టీ దౌర్భాగ్యం  మరియూ తెలుగువారి దురద్రుష్టం కూడా....గతంలో చేసిన తప్పులుకి ఆ పార్టీ ఇప్పటికే  రెండుసార్లు శిక్షని అనుభవించింది...పాఠాలు నేర్చుకుని మారానంటూ ప్రజలమధ్యకు వచ్చింది..ఈసారి తీర్పు మనకోసం కావాలి...మన భవిష్యత్తు కోసం కావాలి...రాష్ట్రాన్ని గాడిలో పెట్టటానికోసం కావలి...ఆ తీర్పు పంచ భూతాల్ని మింగేసే వైకాపా భకాసురుల పాలిట పాశుపతాస్త్రం కావాలి..MAY 7th 2014 చారిత్రత్మకం కావాలి.ఈ రోజు కళ్ళు మూసుకుంటే తరువాత 5 సం అంధకారమే..గుర్తించండి...కళ్ళు తెరవండి..మేలుకోండి...మీ బందు మిత్రులతో ఈ విషయం పంచుకోండి.
1) Why, What, How TDP?


2) Un Heard Secrets of Chandra Babu Revealed


జై తెలుగు తల్లి !! జై తెలుగుదేశం !! జై హింద్.




Tuesday, January 21, 2014

అక్కినేని అస్తమయం!!

అక్కినేని అస్తమయం!!


ఈ రోజు తెల్లవారి జామున 3:00 గం ప్రాంతం లో అక్కినేని తుదిశ్వాస విడిచారని టీవి9 ద్వారా తెలిసింది.
చిత్ర సీమలో సుదీర్ఘప్రయాణం ఆయనిది..ఎన్.టీ.ఆర్[1947- మనదేశం] కంటే ముందే చిత్రసీమలో [1941-ధర్మపత్ని ద్వారా]ప్రవేశించారట....ఈ కళా దిగ్గజం ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన గురిచి కొన్ని విషయాలు రాయాలనిపించింది.అల్లాగే , ఈయన మరణం తో మాయాబజార్ టీములో ఇక మనకెవరూ మిగలలేదు.ఆ సినిమాని కలర్ లో తిలకించే అద్రుష్టం ఈయనకే దక్కింది.
అన్న ఎన్ టీఆర్ తో కూడా ఆయన అనుభంధం సుదీర్ఘమైనది. ఈ సందర్భంగా వారిద్దరి అనుభంధం గురించి సీనియర్ విలేఖరి యు.వినాయకరావు గారు "యుగానికి ఒక్కడు" పుస్తకం లో  ఇలా వివరించారు.

"సమ ఉజ్జీలైన ఏ.ఎన్.ఆర్ & ఎన్.టీ.ఆర్ ఒకరితో ఒకరు పోటీ పడి చిరస్మరణీయమైన నటనని అందించి తెరస్మరణీయులు గా మిగిలారు.నటనలో మాత్రమే గాదు మరెన్నో విషయాల్లో వీరిద్దరూ ఎందరికో మార్గదర్శకులు.పారితోషికం పెంచవలసిన తరుణంలో ఇద్దరూ కలసి కూర్చుని చర్చించుకుని నిర్మాతలకు భారం కాకుండా నిర్ణయాలు తీసుకునేవారు.ఈ అగ్రనటులు కలసి నటించిన చిత్రాలలో అధికశాతం విజయవంతమైనవే.
తెలుగు చిత్రసీమకు ఏ.ఎన్.ఆర్ & ఎన్.టీ.ఆర్ రెండు కళ్ళని సంభోధిస్తూ ఆత్మీయంగా ఆదరించారు తెలుగు చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు.ఆ అభినందనకు తగినట్లుగానే ఆదర్శవంతమైన స్నేహబంధాన్ని కొనసాగించారిద్దరూ.ఒకే వ్రుత్తిలో ఉన్నందువలన కొన్ని సందార్భాలలో అభిప్రాయభేదాలు తలెత్తినా అవి తాత్కాలికంగానే ఉండేవి. వీరిద్దరూ కలిసి 14 చిత్రాలలో నటించి అరుదైన రికార్డు నెలకొల్పారు.

ఆయన అన్నగారు కలిసి నటించిన సినిమాల చిట్టా ఇదిగో:
పల్లెటూరిపిల్ల - 1950
సంసారం - 1950
రేచుక్క - 1954
పరివర్తన - 1954
మిస్సమ్మ - 1955
తెనాలిరామక్రిష్ణ - 1956
చరణదాసి - 1956
మాయాబజార్ - 1957
భూకైలాస్ - 1958
గుండమ్మకథ - 1962
శ్రీక్రిష్ణార్జున యుద్ధం - 1963
చాణక్యచంద్రగుప్త - 1977
రామక్రిష్ణులు - 1978
సత్యం శివం - 1981

Saturday, January 18, 2014

నటసార్వభౌముడికి అక్షర నివాళి!!

 
నట రత్న.విశ్వవిఖ్యాత..నటసార్వభౌమ ...పద్మశ్రీ..మాజీ ముఖ్యమంత్రి..డా. నందమూరి తారక రామారావు...ఇలా పేరుకి ముందు ఎన్ని వున్నా, సగటు తెలుగోడు తో మాత్రం "అన్నగారు" అని ఆప్యాయంగా పిలిపించుకున్న మహోన్నత వ్యక్తి. సినీకళామతల్లి ముద్దుబిడ్డ.నిజాయితీకి నిలువెత్తు రూపం.అవినీతి పరుల పాలిట చంఢశాసనుడు.డిల్లీ పెద్దల పాదాల కింద నలిగిపోతున్న తెలుగువారి అత్మగౌరవాన్ని విముక్తికావించిన రాజకీయ ధురంధురుడు.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఎన్నెన్నో..
ఆ మహనీయుడి 18వ వర్ధంతి సందర్భంగా మరోసారి గుర్తుచేసుకుంటూ ఈ అక్షర నివాళి.