మహానాడు !! తెలుగు తమ్ముళ్ళకి ఇది మరో సంక్రాంతి లాంటిది!! ఎందుకంటే ఈరోజు తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు,గౌరవనీయులైన శ్రి నందమూరి తారకరామారావు 91 వ జన్మదినం కూడా...అందునా 10 సం సుదీర్ఘ విరామం తరువాత అధికారం ప్రాప్తించిన సం లో వచ్చిన పండగ.అందుకే అంచనాలకి మించి 70 వేలు కి పైగా హాజరైనట్లు సమాచారం. మరో 20 వేలు ట్రాఫిక్ లో చిక్కుకుని వెనుతిరిగినట్లు చెపుతున్నారు...యువ ఉపన్యాసకుల్లో జయ నాగేశ్వరరెడ్డి [దివంగత బీవీ మోహన్ రెడ్డీ తనయుడు..ఈయన జోస్యాలు నిజమయ్యేవి అంటారు] , రేవంత్ రెడ్డి , కింజారపు రామ్మోహన్ నాయుడు [దివంగత ఎర్రన్నాయుడు తనయుడు] & లోకేష్ ఆకట్టుకున్నారు. గత పదేళ్ళుగా తల్లీ పిల్ల కాంగ్రెస్ దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎన్నికలను ఎదుర్కొని పార్టీని అధికారంలో కి తెచ్చిన కార్యకర్తలకి దన్నుగా నిలవాల్సిన అవసరం పై వీరు ప్రసంగించిన తీరు ఆకట్టుకుంది.
తీర్మానాలు:
- ఎన్ టీ ఆర్ కి భారత రత్న ఇవ్వాలి
- అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ విభాగానికి ఎన్ టీఆర్ పేరు పెట్టటం [అప్పట్లో మహా 'మేత' రాజశేఖర్ రెడ్డి, తెదేపా చేసిన అభ్యర్దనని తోసిపుచ్చారు]
- జాతీయ పార్టీ గా తెదేపా
- 20 కోట్ల తో కార్యకర్తల సంక్షేమానికి నిధి
No comments:
Post a Comment