Saturday, May 03, 2014

వైకాపా హఠావ్..సీమాంధ్ర బచావ్!!! indeed & apt slogan with rhetoric voice !!

వైకాపా హఠావ్..సీమాంధ్ర బచావ్!!!
ఈ పవన్నినాదం ఇప్పుడు సీమాంధ్ర లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర/గోదావరి జిల్లాల్లో సునామి శ్రుష్టిస్తోంది...దీంతో ఒకప్పుడు తెలుగుదేశానికి అండగా నిలబడిన ఒక బలమైన సామాజక వర్గం మళ్ళీ చేరువయ్యే అవకాశం...అదేవిధంగా కోస్తా లో ఎప్పుడూ నిప్పూ ఉప్పులాగ ఉండే రెండు ప్రధాన వర్గాలు మధ్య సుహ్రుధ్బావ వాతావరణం నెలకొనవచ్చు.. అనుకూల 'పవనా'లతో అనేక నియోజకవర్గాలలో  సైకిల్ బుల్లెట్ లా దూసుకెల్తోందని సమాచారం..ఈ పరిణామలతో వైకాపా దొంగల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి..దిక్కుతోచక రాష్ట్రమంతా తెలుగుదేశం అభ్యర్దుల పై,  వారి సభలకు వచ్చే జనం పై వైకాపా గూండాలు దాడులకి తెగబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి...పవన్ ఇంత ఆవేశంగా వైకాపాని టార్గెట్ చేస్తాడని ఊహించని ఆ పార్టీ, ఎవరు అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినా వివరణ ఇవ్వకుండా ఎదురుదాడి చేసినట్లే, అతన్ని కూడా టార్గెట్ చేసి నమో & నారాలకి అమ్ముడు పోయావని దుమ్మెత్తి పోస్తుంది!! ( ఒకవేళ నిజంగానే అమ్ముడుపోయాడని అనుకున్నా, దొంగల చేతికి రాష్ట్ర పాలనా పగ్గాలు వెళ్ళకుండా వుండే అవకాశం ఉంది కద..అయినా నవ్యాంధ్రప్రదేశ్ అనే శిశువు ఈ కసాయోళ్ళ పాలవకుండా కాపాడ్డానికి పవన్ లాంటోళ్ళు ఎంతమంది అమ్ముడుపోయినా, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకునేవాళ్ళు వాళ్ళని కొనుక్కున్నా తప్పేంటి!)
ప్రజల ఆస్తులను ఎర గా వేసి తండ్రి అధికార అండ తో నొక్కేసిన అవినీతి డబ్బుతో ఇప్పుడు అదే ప్రజల వోట్లని కొనడానికి విచ్చలవిడిగా వెదజల్లుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఇలా ఎన్ని అడ్డదారులు తొక్కినా , మొన్న వాళ్ళ తాబేదారు చానల్ ఎన్ టీవి తో పాటు, ఇప్పుడు లగడపాటి సర్వే లు [ వాస్తవాలకు దగ్గరగా ఉంటాయని అంటారు] కూడా సీమాంధ్ర లో తెదేపా దే అధికారం అని తేల్చేయటంతొ గజన్ బాచ్ గంగవెర్రులెత్తి పోతున్నారు.
తెలుగుదేశం...ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మదరాసీలు గా పిలువబడుతున్న తెలుగుజాతి కి దేశంలో గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ...తెలుగు రాష్ట్రానికి ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్తానాన్ని సంపాదించి పెట్టిన పార్టీ. ఎంతోమంది రాజకీయ నాయకులని రాష్ట్రానికి అందించిన పొలిటికల్ ఫాక్టరీ..ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల ముందు వరుసలో ఉన్న నాయకులందరినీ తెలుగుదేశమే తయారుచేసింది అంటే అతిశయోక్తి కాదు...అటువంటి ఘనమైన చరిత్ర ఉన్న పార్టీ ఇప్పుడు ఒక 420 పార్టీ తో తలపడాల్సి రావటం పార్టీ దౌర్భాగ్యం  మరియూ తెలుగువారి దురద్రుష్టం కూడా....గతంలో చేసిన తప్పులుకి ఆ పార్టీ ఇప్పటికే  రెండుసార్లు శిక్షని అనుభవించింది...పాఠాలు నేర్చుకుని మారానంటూ ప్రజలమధ్యకు వచ్చింది..ఈసారి తీర్పు మనకోసం కావాలి...మన భవిష్యత్తు కోసం కావాలి...రాష్ట్రాన్ని గాడిలో పెట్టటానికోసం కావలి...ఆ తీర్పు పంచ భూతాల్ని మింగేసే వైకాపా భకాసురుల పాలిట పాశుపతాస్త్రం కావాలి..MAY 7th 2014 చారిత్రత్మకం కావాలి.ఈ రోజు కళ్ళు మూసుకుంటే తరువాత 5 సం అంధకారమే..గుర్తించండి...కళ్ళు తెరవండి..మేలుకోండి...మీ బందు మిత్రులతో ఈ విషయం పంచుకోండి.
1) Why, What, How TDP?


2) Un Heard Secrets of Chandra Babu Revealed


జై తెలుగు తల్లి !! జై తెలుగుదేశం !! జై హింద్.




No comments: