మా అమ్మాయి యషు ని తీసుకుని న్యూయార్క్ లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద అవుట్ డోర్ టెన్నిస్ స్టేడియం [23,200 సీట్స్] అయిన "ఆర్థర్ అష్" స్టేడియం లో గత నెల ఆగస్ట్ 28 న జరిగిన బాలల టెన్నిస్ దినోత్సవాలకు వెళ్ళటం జరిగింది.స్టేడియం కి 2 కిమీ దూరం లో ఎయిర్పోర్ట్ హొటెల్ లో రూం బుక్ చేసుకుని ట్రాఫిక్ అవరోధాలు దాటుకుంటూ క్రితం రోజు రాత్రి 9 గం కే న్యూయార్క్ చేరుకున్నాం. ఉదయానే లేచి 10 గంటలకల్లా బిల్లీ జీన్ కింగ్ టెన్నిస్ సెంటర్ చేరుకున్నాం. మాజీ మరియు ప్రస్తుత క్రీడాకారుల చిత్ర పటాలతో స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబై ఆహుతులకు స్వాగతం పలికింది. ప్రతి చిత్రం లోను వారి వారి గత చరిత్ర కూడ ముద్రించడంతో తెలియని వారికి తెలుసుకొనే అవకాశం లభించింది. పిల్లలకు టెన్నిస్ క్రీడ పై ఆసక్తిని పెంచే విధంగా కార్యక్రమాలు రూపొందించడమే కాకుండా ఫేస్ పెయింట్లు, కార్టూన్ కారక్టర్లైన స్పంజి బాప్,డోరా లాంటి క్లౌన్స్ తో ఫోటొ సెషన్స్ వంటివి కూడా ఉండటంతో పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..యషుతో పాటు మేము కూడ మంచి సమయం గడిపాము. కిం క్లిస్టెర్, ఫెదరర్, నాడాల్, రాడిక్, జకోవిచ్ తదితరులంతా వచ్చి ఆ మరుసటి రోజు నుంచే ప్రారంభమయ్యే యూయెస్ ఓపెన్ పోటీలకి నెట్ ప్రాక్తీస్ చేస్తూంటే ప్రత్యక్షంగా చూడగలిగాం. అంతే కాకుండా డిస్ని రాక్ స్టార్స్ అయిన జోనాస్ బ్రదర్స్ సంగీత కచేరీ కూడా ఏర్పాటు చేసారు. వారి సంగీతం అంటే అమెరికా పిల్లలు ఎంతగా చెవి కోసుకుంటారో వారి కేరింతలు చూస్తుంటే తెలిసింది....
స్టేడియం లో కలియ తిరుగుతుండగా అసలు ఇంత పెద్ద స్టేడియానికి ఆర్థర్ పేరు పెట్టి ఆయన పేరు మీదే ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నారు ? 1881 సం లో స్థాపించబడి 17 భౌగోళిక భాగాలతో 700,000 మంది వ్యక్తిగత సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద టెన్నిస్ సంస్థ గా అలరారుతూ ఆర్థర్ అష్, లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్, గ్రాండ్ స్టాండ్ స్తేడియంలతో కలుపుకుని మొత్తం 18 స్టేడియంలు ఉన్న ఈ సెంటర్ కి "బిల్లీ జీన్ కింగ్" పేరే ఎందుకు పెట్టాల్సివచ్చింది? ఎవరీ ఆర్థర్ అష్ & బిల్లీ జీన్ కింగ్‌లు? ఇంటికి రాగానే అంతర్జాలం లో కెళ్ళి పరిశొధించగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి.
ఆర్థర్ ఆష్:
యూఎస్ ఓపెన్ చాంపియన్ షిప్ గెలుచుకున్న మొట్ట మొదటి నల్ల జాతీయుడు..అంతే కాకుండా వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్న ఏకైక నల్లజాతీయుడు కూడా ఇతనే కావటం విశేషం.
బిల్లీ జీన్ కింగ్:
మహిళా టెన్నిస్ ప్రపంచంలో ఉక్కుమహిళ గా పేరుతెచ్చుకుంది ఈమె...1973 హ్యూస్టన్ లో వింబుల్డన్ విజేతైన బాబి రిగ్గ్స్ అనే ఆయనతొ తలపడి వరుసగా మూడు సెట్ల విజయం సాధించి "బాటిల్ ఆఫ్ సెక్సెస్" టైటిల్ ని కైవసం చేసుకున్న "షీరో". అంతేకాదు, ఒకే సీజన్ లో అత్యధిక పారితోషికం [$100,000] తీసుకున్న మొట్ట మొదటి మహిళా ఆథ్లెట్ కూడా ఈమెనే. ప్రప్రధమ మహిళ టెన్నిస్ అసోసియేషన్ ని స్థాపించి దానికి అధ్యక్షురాలిగా చాలా కాలం పనిచేసారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్రనే ఉంది ఈమెకు.
వీరి ఇద్దరిగురించీ చదివిన తరువాత స్టేడియంకీ & టెన్నిస్ సెంటర్ కీ వారి పేర్లు పెట్టటం సబబే అనిపించింది.
అవకాశం ఉంటే, ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఒక్కసారైనా సందర్శించవలసిన స్టేడియం ఇది.
చాయా చిత్రాలు ఇక్కడ:
http://picasaweb.google.com/Delawareandhra/USOpenTennisKidsDayNewyork#
Sunday, September 12, 2010
Saturday, July 10, 2010
FIFA 2010 Finals : ఆక్టొపస్ Vs చిలక ?
ఇప్పటికే స్పెయిన్ గెలుస్తుంది అని జ్యోస్యం చెప్పిన పాల్ అని పిలవబడే ఓ ఆక్టొపస్ కు, కాదు కాదు ఫీఫా 2010 ఫైనల్ లో గెలిచేది నెదర్లాండ్సే అని సవాల్ విసురుతూ బుల్లితెర పైకి వచ్చింది సింగపూర్ లో మణి గా ప్రాచుర్యం పొందిన ఓ చిలక...జ్యోస్యం అంటూ చెపితే అది నేనే చెప్పాలి ! అది నా జన్మ హక్కు అనుకుందో ఏమో!మరి.
యెంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్లు వీటి జ్యోస్యం ఆయా జట్ల ఆటగాళ్ళ ఆత్మవిశ్వాసానికొచ్చింది కదూ?
పాల్ జ్యోస్యం ప్రకారం స్పెయిన్ దే విజయం...
మణి జ్యోస్యం ప్రకారం నెదెర్లాండ్స్ గెలుస్తుందట....
Friday, July 09, 2010
ఫ్రీమేకు పాటలు!!
సినిమా పరిశ్రమలో ముఖ్యంగా మేకులు[డైరెక్ట్] మరియు రీమేకులు అని రెండు రకాలనుకుంటే అనధికారికంగా ఫ్రీమేకు అని మరోకటి ఉంది.మన దేశీ సినిమా సంగీత దర్శకులు విదేశీ సంగీతాన్ని అప్పుడప్పుడు ఫ్రీమేక్ చేస్తూ పాటలు సమకూరుస్తారు అన్న విషయం మన అందరికీ తెలిసిందే….అవి కూడ సూపర్ హిట్స్ అవుతుండటం మనం వింటూనే వున్నాం……అలా దిగుమతైన ఒక పాట గురించి నా శ్రీమతి ఈమధ్య నా దగ్గర ప్రస్థావించడం జరిగింది……ఆ పాట పోకిరి చిత్రం కోసం మణిశర్మ సంగీతం సమకూర్చిన 'గల గల పారుతున్న గోదారిలా.'….కాకతాళీయమో లేక కావాలనే చేసారో గాని ,1974 లో సూపర్ స్టార్ క్రిష్ణ నటించిన 'గౌరి ' చిత్రం లోని అదే 'గల గల…' పాటకి ఇది రీమిక్స్ అట…..మరి గౌరి చిత్రం లోని పాట దేనికి రీమిక్సో తెలుసుకోవాలనుందా?…అందుకోసం మీరు అప్పటికి 35 ఏళ్ళు వెనక్కు వెళ్ళాలి మరి.…..అంటే 1939 లొ హోసే ఫెలిషియానో అనబడే ఆంగ్ల గాయకుడు పాడగా విడుదలైన ఒక ఆంగ్ల నర్సరీ గీతానికి మహా నకలు అనితెలిసింది….…ఇక్కడ క్లిక్ చేసి మీరూ వినవచ్చు.
అలాగే, జగపతిబాబు ప్రియమణి జంటగా నటించగా ఈ మధ్య విడుదలైన ప్రవరాఖ్యుడు సినిమా కోసం కీరవాణి కూడ అమెరికన్ గాయకుడు జస్టిన్ టింబర్లేక్ ఆల్బం నుంచి ఒక పాట ని ఇలాగే ఫ్రీమేకు చేసుకున్నట్లు తెలిసింది...ఆ పాటని టీవీ9 పరిశోధించి ప్రసారం చేయగా యూట్యూబ్ లో కూడ పెట్టారు...దానికోసం ఇక్కడ చ్లిక్ చేయండి.
Thursday, July 08, 2010
ఆక్టొపస్ జ్యోస్యం!!
ఆక్టొపస్ జ్యోస్యం!!
ఫీఫా 2010 లో అర్జెంటీనా తలరాత ను ఒక ఆక్టొపస్ రాసిందా? అవుననే అంటున్నారు కొంతమంది అర్జెంటీనా అబిమానులు…..అంతేకాదు… అర్జెంటీన 0-4 స్కోరు తో జర్మనీ పై ఓడిపోవటానికి కారణం ఈ ఆక్టొపస్ జ్యోసమే కారణం అని దాని అభిమానులు కొందరు నమ్ముతున్నారట...అందుకే దాన్ని చంపుతామని, కూర వండుకు తింటామని బెదిరింపులు వస్తున్నాయట..ఇంతకీ ఈ ఆక్టొపస్ ఎవరో తెలుసుకుందాం.
జర్మనీ పాల్గొనే ప్రతి అంతర్జాతీయ ఫుట్ బాల్ మాచెస్ లో విజయం ఎవరిని వరించబోతోందో అంచనా వేయటానికి ఈ ఆక్టొపుస్ జ్యోస్యం పై ఆదారపడటం జర్మన్ల కు ఆనవాయితీగా వస్తోంది... 2006 లో జన్మించిన ఈ ఆక్టొపుస్ కి పాల్ అని నామకరణం చేసారు.ఈ పేరు ఒక జర్మన్ కవి రాసిన కవిత నుంచి వచ్చింది....దీని నివాసం ఓబర్హాసన్,జర్మనీ లొ ఉన్న సముద్ర జీవుల కేంద్రం.
ఎప్పుడు జర్మనీ ఫుట్ బాల్ మాచ్ లో తలపడుతున్నా, ఇరు జట్ల జాతీయ జెండాలను చుట్టి ఉంచిన రెండు ఆహార పాత్రలు ఈ ఆక్టొపుస్ ముందు ఉంచుతారు….అది ఎవరి పాత్రలోని అహారాన్ని ఎంచుకుంటే ఆ జట్టు ని విజయం వరిస్తుందని నమ్ముతూ వస్తున్నారు...అన్ని సందర్బాలలో ఈ జ్యోస్యం నిజమైందా అంటె కాదనే చెప్పలి.. ఎందుకంటే యూరో 2008 జరుగుతున్నప్పుడు రెండుసార్లు తన జ్యోస్యం తప్పైంది…కాకపోతే 2010 వరల్డ్ కప్ ఫలితాలను 100 శాతం సరిగా చెప్పటం ద్వారా వార్తలలో ని జంతువైంది ఈ బహుబాహుణి...అలాగే మనుషుల్లాగానే పేరు తో పాటు శత్రువులని కూడా సంపాదించుకుంది....
ఇవీ పాల్ ది ఆక్టొపస్ ఇప్పటివరకూ చెప్పిన జ్యోస్యాలు:
| Opponent | Tournment | Paul's predictions | Result |
| Euro 2008 | Germany | Correct | |
| Euro 2008 | Germany | Incorrect | |
| Euro 2008 | Germany | Correct | |
| Euro 2008 | Germany | Correct | |
| Euro 2008 | Germany | Correct | |
| Euro 2008 | Germany | Incorrect | |
| World Cup 2010 | Germany | Correct | |
| World Cup 2010 | Serbia | Correct | |
| World Cup 2010 | Germany | Correct | |
| World Cup 2010 | Germany | Correct | |
| World Cup 2010 | Germany | Correct | |
| World Cup 2010 | Spain | Correct |
Subscribe to:
Posts (Atom)