Friday, May 02, 2008

నా మట్టు కు నాకు ఇది ముమ్మాటి కీ శ్రీ నందమూరి తారక రామారావు అంతర్జాతీయ విమానాశ్రయమే!!!!

పాలక తెలుగు ద్రోహులు ఏ పేరు పెట్టినా అందులో నేను భాగస్వామిని కాదు కాబట్టి, నా కంఠం లో పాణం ఉన్నంతవరకూ ఈవిమానాశ్రయాన్ని ఈ పేరుతోనే వ్యవహరిస్తానని ఈ బ్లాగ్మమహాసభ సమక్షమున ప్రతిజ్ఞ చేస్తున్నాను.....సాటి తెలుగువాడి గా మీరుకూడా దీనిని స్వాగతిస్తారని నమ్ముతున్నాను !!!!!!



















సమయం లేదు!!!!!

మనిషి జీవితంలో సంతోషం ఉన్నా, ఒక చిరు నవ్వుకే సమయం లేదు
రాత్రి పగలు పరుగెడుతూనే వుండే లోకంలో, జీవితం కోసం సమయం లేదు
అందరి పేర్లు మొబైల్ లో ఉన్నాయి, కాని వారితో స్నేహానికే సమయం లేదు
కళ్ళలో ముంచుకొచ్చే నిద్ర, ఒక కునుకు తీయటానికే సమయం లేదు
కాసుల వేటలో ఒకటే పరుగు, దానికి అలుపు సొలుపు తరుగు
ప్రతి క్షణం నవ్వే వారికి, వారి వారి సంతోషానికి మాత్రం సమయం లేదు

ఈ సమయంతో పాటు పరుగుతీయడానికి ఎక్కడ సమయమూ సరిపోవడంలేదు :(

Monday, April 28, 2008

మన బాపు కొంటె గీతలు

చూసినవే అయినా ఆయన హాస్య చతురత మరో సారి మీతో పంచుకోవాలని ఒక చిన్న ప్రయత్నం....






















Friday, April 25, 2008

ఈ రచన కు శీర్షిక మీరే సూచించండి....

వంటరితనానికి భయపడేవాడను
నన్ను నేను ఇష్టపడటం నేర్చుకున్నప్పటి వరకు
అపజయానికి భయపడేవాడను
అది నా ప్రయత్న లోపమని గ్రహించినప్పటి వరకు
విజయానికి భయపడేవాడనుఅది నా ఒక్కడి సంతృప్తి కొరకే అని గ్రహించినప్పటి వరకు
మనుషుల అభిప్రాయాలకి భయపడేవాడను
ప్రతి మనిషికి మరో మనిషి పై ఒక అభిప్రాయం ఉంటుంది అని గ్రహించినప్పటి వరకు
తిరస్కారానికి భయపడేవాడను
నన్ను నేను విశ్వసించటం నేర్చుకున్నప్పటి వరకు
కష్టానికి భయపడేవాడను
ఎదగడానికి అది ఒక చిన్న అవరోధం అని గ్రహించినప్పటి వరకు
నిజమంటే భయపడేవాడను
అబద్దం వికృత రూపం చూసేంత వరకు
జీవితం అంటే భయపడేవాడను
దాని అందాన్ని ఆస్వాదించేప్పటి వరకు
మరణం అంటే భయపడేవాడను
అది దాని అంతం కాదని ఆరంభమని గుర్తించే వరకు
గమ్యం అంటే భయపడేవాడను
నా జీవితాన్ని మార్చుకోగల శక్తి నాలోనే వుందని గ్రహించు వరకు
ద్వేషమంటే భయపడేవాడను
అది కేవలం అజ్ఞానమని తెలిసే వరకు
ప్రేమంటె భయపడేవాడను
అది నా హృదయాన్ని తాకనంత వరకు
భవిష్య కాలమంటే భయపడేవాడను
జీవితం వృద్ధి చెందుతోందని గ్రహించు వరకు
భూత కాలమంటే భయపడేవాడను
అది ఇక నన్నేమీ చెయలేదని గ్రహించు వరకు
అంధకారమంటే భయపడేవాడను
తారల సౌందర్యం తిలకించువరకు
మార్పు అంటే భయపడేవాడను
అందమైన సీతాకోకచిలుకగా ఎగిరేముందు
దానికి విక్రుతమైన గొంగళి పురుగు రూపం ధరించక తప్పలేదని గ్రహించు వరకు

మన శ్రీధర్ ని ఆంధ్ర ఆర్ కె లక్ష్మన్ అనటం అతిశయోక్తి కాదేమో!!!