Wednesday, May 07, 2014

Huge VOTER turnout !!!

80% పోలింగ్ దేనికి సంకేతం ? ఆభివ్రుద్ధి కి వోటు పోటెత్తిందా? సీమాంధ్ర పౌరుషం ఉవ్వెత్తున ఎగసిందా? 
సీమాంధ్రుడి ఆగ్రహజ్వాలల్లో విభజన, కుట్ర, అవినీతి రాజకీయాలు మాడి మసై పోయి అభివ్రుద్ధి రాజకీయం పునీతం కానుందా? 
ఆంధ్రుడి తీర్పు ఎప్పుడూ విస్పష్టమే...ఏ ఎన్నికలైనా సంపూర్ణ అధికారమివ్వటమే అలవాటు...తెలుగునాట సంకీర్ణానికి తావులేదు..వోటింగ్ శాతం పరిశీలిస్తే అదే జరగబోతోంది అనిపిస్తోంది. మే 12న వెలువడే స్థానిక ఎన్నికల ఫలితాలతో ప్రజల మొగ్గు ఎటు ఉందో కొంతవరకు తెలిసినా అసలు ఫలితాల కోసం మే 16 వరకు నిరీక్షణ తప్పదు.

కానీ, మన ఘనతవహించిన గవర్నరు గారు మాత్రం ఈ క్రింది ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పగలగాలి !! 
1. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా ఈవిఎంలు ఒకే రీతిలో ఒకే సమయంలో ఎందుకు మొరాయించాయి ? 
2.ప్రజలపై, మీడియా పై వైకాపా గూండాలు దాడులకి తెగబడుతుంటే పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు?
3.కల్తీ మద్యం దొంగ నోట్లు పంచిన సంఘటనల్లో ఎన్ని కేసులు నమోదు చేసారు?

2 comments:

hari.S.babu said...

తెలిసే చేసిన తప్పులకి వాళ్ళు సంజాయిషీ లిస్తారా? చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచి రందరున్ అన్నట్టు చెల్లుతున్నది గదాని మా అంత పుడింగి లేదని విర్రవీగి వెధవ పన్లు చేయ్యడం, మాడు పగిలే దెబ్బ తగిల్తే కిక్కురు మనకుండా తోక ముడవటం - అలవాటే గదా ఆ జాతికి!

Goutami News said...

BAAGAA CHEPPAARU...