Sunday, February 06, 2011

ఎట్టకేలకు 'హస్త ' మించిన సూరీడు!

పీఆర్పీ నాయకుడు తెల్లదొరసాని సోనియా ముందు సాగిల పడి ఏమి మాట్లాడి ఉంటాడో అన్న దానికి వ్యంగోక్తి...ఇది కేవలం కల్పితమే కాని ఖచ్చితం గా పీఆర్పీ అధినాయకుడిని ఉద్దేశించే.
సీరియో, సోనియా ఆఫీస్ ముందు అటూ ఇటూ తిరుగుతూ సొనియా కంట్లో పడటానికి ప్రయత్నిస్తూ ఉంటే
మేడం: "ఎవరదీ"? అన్నారు
సీరియో: " నేను మేడం, చిరంజీవిని! ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చి కలిసాను...గుర్తుపట్టలేదా?"
మేడం:ఓ! నువ్వా చిరంజీవి ! ఎమిటీ ఇలా వచ్చావు?
సీరియో: "ఎదో, ఒకసారి ఢిల్లీ వచ్చి కలవమన్నారంటేనూ"....అంటూ నసిగాడు.
మేడం: "ఆ! ఏపనీ లేకుండా వున్నాడు....మనకేమన్నా పనికోస్తాడేమో చూడమని ఉండవల్లో , లగడపాటో అన్నారయ్యా!...అందుకే రమ్మన్నా.....బావున్నావా?
సీరియో:ఆ!ఏం బాగులే మేడం...ఎవరికీ పనికి రాకుండా పోయాను...పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, ఎంటీయారు పార్టీ పెట్టిన 9 నెలలో అధికారంలోకొచ్చాడని ఆ రికార్డ్ అధికమిద్దామని సరిగా ఎలెక్షన్లకు 8 నెలలు ముందుగా పార్టీ పెట్టి పోటీ చేస్తే ప్రజలు నాకు 18 సీట్లతో సరిపెట్టింది గాక పోగా, నా స్వంత నియోజక వర్గంలో వోడించారు అని మీకు తెలుసు కదా....దాంతో అందరూ చిన్న చూపు చూసేవాళ్ళే.....చంద్రబాబేమో "పీ ఆర్పీ యా? అదెక్కడుంది ఇంకా?" అంటాడు...ఇక రాజశేఖర్ జీవితా చెప్పక్కర్లేదు...నా బ్లడ్ బాంక్ విషయం వదల్టల్లేదు.. .ఆ రోజాది? ఇప్పుడు జగన్ పక్కన చేరింది మేడం.. నన్ను ఇంకా అవమానిస్తూనే వుంది... "అందాకా ఎందుకు,.....స్వంత తమ్ముళ్ళు కూడా మొహం చాటేసారు" మేడం.ఇక నాతో మిగిలిందల్లా నన్నిలా బ్రష్టు పట్టించిన నా బామ్మర్ది అల్లూ మరియూ మీతో కలిస్తే పదవులొస్తాయని అంగలార్చుకుంటూ ఎదురుచాసే ఎమ్మెల్ల్యేలు..." అని సవివరంగా చెప్పాడు...బోరున విలపిస్తూ.
మేడం: ఛ ఛ...ఊరుకో....ఏంటి చిన్న పిల్లడిలా.... అయినా నీకేంటి...పెద్ద మేకాస్టార్ వి...పులులు ఎన్ని గాండ్రిచినా గ్రామ సింహాని కి వచ్చిన నష్టం ఏమీ లేదు కదా.
సీరియో: గ్రామ సింహం తో పోల్చినందుకు కొంచం మనసు చివుక్కుమన్నా , పాపం తెలుగు సరిగా రాదు కదా అని మళ్ళీ తనే సర్దుకుని , పోండి మేడం, మీరు కూడా జోకులు...అదంతా బ్రతికున్న రోజుల్లో..ఇప్పుడు కాదు.
మేడం: అయితే ఇప్పుడు ఏమి చేద్దామని అనుకుంటున్నావు?
సీరియో: నేను చెయ్యటానికి ఇంకా ఏముంది మేడం....అంతా మీ చేతుల్లోనే వుంది..
మేడం: నా చేతుల్లోనా?
సెరియో:అవును మీ వల్లే అవుతుంది...పీయార్పీ ని మీ కాంగీ లో కలిపేసుకుంటే అదే పదివేలు...అదే జరిగితే నా రాజకీయ జన్మకి ఇంతకంటే ఇంకేమి కావాలి చెప్పండి.... ...ప్రతిపక్ష నాయకుడి గా ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై ఆ జగను చంద్రబాబు ల తో పోటీ పడి ఊళ్ళు పట్టుకుని తిరిగుతూ పోరాడే బాదా తప్పుతుంది....ఇతర నాయకుల సూటీ పోటీ మాటలు తప్పుతాయి.....మీరు ఎలగూ కాంగీ లో ఒక హోదా కలిపిస్తారు కాబట్టి నా ఈ కష్టాలన్నీ గట్టెక్కుతాయి
మేడం: ఆలోచన బాగానే వుంది కానీ, అవినీతి కాంగ్రేసు వాళ్ళని పంచలూడేలా తన్నాలన్నాడు మీ తమ్ముడు? అతగాడికి ఈ విలీనం ఒకే నా?
సెరియో: వాడి మొహం! వాడి మాటలు అన్నీ "పిచ్చి కుదిరింది! రోకలి తలకు చుట్టండీ" అన్నట్లుంటాయి ..అవేమీ మీరు పట్టీంచుకోవద్దు....దయచేసి మమ్మలిని కలిపేసుకుంటే, బయటకెళ్ళి మీడియా వాళ్ళకి, మీరే మమ్మలని కలవమన్నరనిన్నూ, పోలవరానికి జాతీయ హోదా ఇస్తానన్నారనిన్నూ, కాపులకి బీసీ హోదా కలిపిస్తానన్నరనిన్నూ చెప్పుకుంటా"
మేడం: మరి అభిమానుల సంగతో?
సెరియో: వాళ్ళు వట్టీ వెర్రిబాగులోళ్ళు మేడం...వాళ్ళ అడ్డు ఎప్పుడో పార్టీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడే తప్పించేసాడు గా మా అల్లూ బావ" అన్నాడు కిసుక్కున వెకిలిగా నవ్వుతూ.
మేడం:మరి ప్రతిపక్షం గా ప్రజా సమస్యలపై పోరాడతారని మిమ్మలని ఎన్నుకున్న తిరుపతి మరియూ ఇతర 16 నియోజకవర్గాల ప్రజలకు ఇలా కలవటం ఇష్టమేనా అని తెలుసుకున్నారా?
సెరియో:ఆ! వాళ్ళదేముంది మేడం...వట్టి గొర్రెల మంద...ఒక గొర్రె బే అంటే ఇంకొక గొర్రే కూడా బే అంటుంది...అయినా ఇది నా పార్టీ...నా బావ పార్టీ...ఇద్దరం కష్టపడి పార్టీ నుంచి ఒక్కొక్కరినీ బయటకు పంపేసి ఇలా మీ ముందు దేహీ అని చేయి చాచే దురవస్థకు తీసుకొచ్చాము....అయినా!వాళ్ళెవరు ఇవన్నీ అడగటానికి? అవేమీ పట్టిచుకొనే స్థితి లో లెను నేనిప్పుడు.మీ అనుగ్రహం లభిస్తే చాలు.
మేడం: [మనసులో: బాగా దొరికాడు బకరా గాడు...వీడిని ఇప్పుడు అవసరానికి వాడుకుని, తరువాత చూపిస్తా! కాంగీరేసు దెబ్బంటే ఏంటో.] ఇప్పటికి మాత్రం విలీనానికి " తథాస్తు!" అనేసి , లోపలికి వెల్లిపోయింది అ తెల్లదొరసాని.
మేడం తో మాట్లాడిన తరువాత, ఆ విషయాలు తిరిగి పార్టీ తో చర్చించి హైదరాబాదు లో ప్రకటన చేస్తానన్నవాడు, అందాక ఆగలేక , ఢిల్లీ లోనే మీడియా ముందుకు వచ్చి, అదిగో! ఎంతటి ఉప్పొంగిన ఉత్సాహం తొ విలీన ప్రకటన చేస్తున్నాడో మీరే ఇక్కడ క్లిక్ చేసి తిలకించండి...

2 comments:

Anonymous said...

Excellent!.

Because of fools like Chiru, foreigners are ruling India over 1000 years.

Traitors like these, always side with foreigners against Indians.

Anonymous said...
This comment has been removed by a blog administrator.