Friday, February 25, 2011

శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ అస్తమయం!!

ముళ్ళపూడి వెంకట రమణ అస్తమయం తో పదహారణాల తెలుగు సాహిత్య శకం ముగిసిపోయింది.ఈయన రచనా శైలికి నేను వీరాభిమానిని...ఆంధ్ర పత్రిక లో సబ్ ఎడిటర్ పనిచేస్తూ రక్తసంబంధం సినిమాకి కథ అందించటం ద్వారా సినీ రంగం లోకి ప్రవేశించారు. సినిమా తో నే పెద్దాయన ఎన్ టీ ఆర్ అన్నగారి గా తెలుగింటి ఆడ పడుచులందరి హ్రుదయాలలో నిలిచిపోయారు. తరువాత దాదాపుగా బాపు సినిమాలు అన్నింటికీ పనిచేసారు.
బాపురమణలది విడదీయరాని అనుబంధం...స్నేహానికి ప్రతిరూపాలు వీళ్ళిద్దరూ...బాపురమణలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది "ముత్యాలముగ్గు" సినిమా..అందులో రమణ రాసిన మాటలు ఇప్పటికీ ప్రేక్షకులను కవ్వించి నవ్విస్తాయి..ఈ సినిమాలో విలన్ రావూ గోపాల్రావు, సూర్యాస్తమయ సమయంలో ఎర్రబడిన ఆకాశాన్ని చూస్తూ తన అనుచరుడితో ఇలా అంటాడుసూర్యాస్తమయ సమయంలో ఎర్రబడిన ఆకాశాన్ని చూస్తూ తన అనుచరుడితో ఇలా అంటాడు .
"ఇగో సెగట్రీ ! ఆకాశం వంక చూడు, ఇప్పుడే ఎదో మర్డర్ జరిగినట్లు గా లేదూ?" అని ఒక్క మాట తో ప్రతినాయకుడు ఎంతటి దుర్మార్గుడో ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు.[ఇదే సన్నివేశం ఇప్పుడు ఒక డిజైనర్ కత్తితో ఎదుటివాడిని తెగవేయటం ద్వారం చూపిస్తున్నారనుకోండీ.]
మరో సన్నివేశం లో "మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటదండే"...ఇలా సాగిపోతూ ఉంటాయి మాటలు ఆసినీమాలో.
అలాగే
, ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్న "బుడుగు" స్రుష్టికర్త ఈయనే.

పాత్రలు మామూలు వ్యవహారికా భాషలో మాట్లాడుకోవటం ఈయన రచన లో ఉన్న ప్రత్యేకత..ఒక సారి "బుడుగు" కార్టూన్లు చూస్తే మీకే తెలుస్తుంది.


ఆయనికి 80 ఏళ్ళు అయితే అయన రచనకి 65 ఏళ్ళురచనే శ్వాస గా జీవించి, చివరిగా బాలక్రిష్ణ నటిస్తున్నశ్రీ రామ రాజ్యంసినిమాకి షూటింగ్ ప్రారంభం రోజునే స్క్రిప్ట్ అందించేసారు...మరియూ స్వాతి వీక్లీలోకోతి కొమ్మచ్చిధారావాహిక రాస్తూ తుది శ్వాస విడిచారు.

No comments: