Friday, July 13, 2007

తెలుగువాడి ఆక్రోశం


ప్రజాప్రతినిధుల ముష్టి ఘాతాలు
ప్రజాస్వామ్యానికే శరాఘాతాలు

కమీషన్ల పై మహిళా కమిషన్ సిగపట్లు
ఇక తీర్చేవారెవ్వరు స్త్రీ జనుల అగచాట్లు

నిజాలు నిర్భయంగా వెలికి తీసే ఓ విలేఖరి
కడపవారి శైలి లొ తప్పదు నీ పై భౌతిక దాడి

అడుగడుగున కబ్జా గడి గడి కీ అవినీతి
రాష్త్రమంతా వ్యాపించిన వింతైన సంస్క్రుతి

నీళ్ళు,నిధులు కడప పల్లమెరుగు
మిగతా జిల్లాల అభివ్రుద్ధి దేవుడెరుగు


నింగినంటిన నిత్యావసర ధరలు
ఏవీ కొనేటట్టూ లేవు తినేటట్టూ లెదు

అమ్మబోయిన అడివి కొనబోయిన కొరివి
ఏ దిక్కూ తోచక త్రిశంకు లో సగటు జీవి

ఇందిరమ్మ ఇళ్ళన్నీ హస్తంపార్టీ కి వోటేసినోళ్ళకే
అదేమని అడిగితే నీ చేతికి ఇనుప సంకెళ్ళే

ఎక్కడ చూసినా దొపిడీలు దొంగతనాలు
రాష్త్రమంతా అరాచకాలు అక్రుత్యాలు
అడిగావా ఇదేమి పాలనని
పెడతారు కేసు నీపై "రాజ" ద్రోహివని

ఇది హరితాంధ్ర కు కొత్త అర్ద్ధం తెలుసుకో
నిఘంటువు లొ ఆదర్శాంద్ర కు అర్ద్ధాన్ని మార్చుకో

ఇదే ఇదే ఇందిరమ్మ రాజ్యం
కాంగిరేసు మార్కు ప్రజా రాజ్యం

2 comments:

Unknown said...

Bujji, Its a beautiful political poem.......

రాధిక said...

"అమ్మబోయిన అడివి కొనబోయిన కొరివి
ఏ దిక్కూ తోచక త్రిశంకు లో సగటు జీవి"
చాలాబాగుందండి.