Wednesday, July 18, 2007

"నాకు నచ్చిన కొన్ని సంస్క్రుత వాక్యాలు తెలుగు భావాలతో"

"యత్ర నార్యస్థు పూజ్యంతే రమంతే తత్ర దేవత" -ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారట

" శిశుర్వేత్తి పశుర్వేత్తి, వేత్తి గాన రసం ఫణి: " - సంగీతమును; శిశువులు, పశువులు, పాములు కూడా ఆనందించ గలవు
"ధర్మో రక్షతి రక్షిత:" - ధర్మాన్ని రక్షిస్తే అది మిమ్మలని రక్షిస్తుంది

"అతి సర్వత్రా వర్జయేత్" - దేనిలో నైనా అతి ప్రమాదకరం
"కామాతురానాం న భయం న లజ్జ" -కామం తో కళ్ళు మూసుకుపోయినవాడికి సిగ్గు భయం వుండవు

"న భూతో న భవిష్యతి" - ఇంతకుముందు సాధ్యపడనిది ఇకముందు సాద్యంకానిది

"దీపం జ్యొతి పరబ్రహ్మః, దీపం సర్వ తమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే" -దీపం పరబ్రహ్మ స్వరూపం.దీపం చీకటి ని తరిమేస్తుంది.దీపం తో అన్నీ సాధించవచ్చు.సంద్యాదీపానికి ఇవే నమస్సులు

"జాతస్య హి ద్రువో మ్రుత్యుః" - పుట్టిన ప్రతి జీవి కీ మరణం తప్పదు



"యధా యధా హి ధర్మస్యగ్లానిర్ భవతి భారతఅభ్యుత్థానం అధర్మస్యతదాత్మానం స్రజమ్య్ అహం " -ధర్మం నశిస్తున్నపుడు అధర్మం పెరిగిపోతున్నపుడు నేను మళ్ళీ ఈ భూమి మీదకు వస్తాను

"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ ధుష్క్రుథాం! ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!!" -దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు నేను మళ్ళీ మళ్ళీ అవతరిస్తూనే వుంటాను

"కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన; మా కర్మ-ఫల-హేతుర్-భూర్మ, మతే సంగొస్త్వకర్మిణి"
-నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు ఫలితం సంగతి నాకు వదలి పెట్టు


5 comments:

Viswanadh. BK said...

పదాలైతే ఇచ్హారుగాని వాటి అర్ధాలను కూడా సేకరించి ఇవ్వగలిగితే భావుండేది.

Bujji said...

అదే ప్రయత్నంలో ఉన్నానండి...మీ సలహాకి క్రుతఙ్ఙ్తతలు

KKG said...

కామాతురాణాం న భయం న లజ్జా!
అట్లాగే నా లాంటి పుస్తకాల పురుగుల కోసం ఇంకోటి వుందండోయ్

విద్యాతురాణాం న సుఖం న నిద్రా!....

మనసుగతి ఇంతే..మనిషి బ్రతుకంతే..మనసున్న మనిషికి సుఖములేదంతే......

Bujji said...

అలా అనకండి కెకెజి...ఎంత పంచినా తరగనిది విద్యే నని అన్నారు కదా!

Nrahamthulla said...

ఎవరి తల్లి వారికిష్టం.ఎవరి మాతృభాష వారికి గొప్ప.సంస్కృతాన్ని కాదని LONG LIVE CLASSICAL DIVINE TAMIL అని తమిళులు వారి భాషాభివృధ్ధి కోసం శ్రమిస్తున్నారు.తమిళుల భాషాభిమానానికి వాళ్ళను మెచ్చుకోవాలి.తమిళనాట ముస్లిములు కూడా మసీదుల్లో ఉర్దూ అరబీ భాషలకు బదులు తమిళంలోనే మతవ్యవహారాలు నడుపుకొంటున్నారు.మనం కూడా తెలుగును మన తల్లి భాషగా దేవభాషగా LONG LIVE CLASSICAL DIVINE TELUGU అంటూ గౌరవిద్దాం.మత వ్యవహారాల్లో క్రైస్తవులు ఎలా తెలుగును వాడుతున్నారో అలా మిగతా మతాలు కూడా తెలుగును విస్తారంగా వాడాలి.భాషకు వాడుకే ప్రాణం.వాడని భాష పాడుపడుతుంది.తెలుగుతల్లికి 74 మిలియన్ల బిడ్డలున్నారు.ఒక్కొక్క పదాన్నే కూర్చుకుంటూ పాతికేళ్ళపాటు శ్రమపడ్డ హీబ్రూ ను మించిన పుష్టి తెలుగుతల్లికి ఉంది.సకల విజ్ఞానశస్త్రాలనూ మనభాషలోకి అనువదించుకొని మన భాషలోనే చదువుకొనే అవకాశాలు కలగాలి.తెలుగులో చదివినా ఉపాధి దొరకాలి.