Wednesday, August 03, 2011

పాకిస్తాన్ రాజకీయ రంభ!

హినా రబ్బాని ఖర్..సెలెబ్రిటి ప్రపంచం లో ఒక్కసారిగా పేలిన పాకిస్తానీ బాంబ్.అతి పిన్న వయసులోనే మంత్రి పదవి[విదేశీ వ్యహారాలు] కొట్టేసిన రాజకీయ రంభ..అదీకాక విదేశీ వ్యహారాల మంత్రిత్వ శాఖ ఒక మహిళకు దక్కటం పాకిస్తాన్ లో ఇదే ప్రథమం.లాహోర్ యూనివర్సిటి లో బి ఎస్సీ హానర్స్ చేసి, యూనివర్సిటి ఒఫ్ మసాచూసెట్స్ లో హాస్పిటాలిటి మేనేజ్ మెంట్ లో పట్టా పొందిన విద్యాధికురాలు కూడా..ఈమె ఇటీవలే శాంతి చర్చల పేరిట భారత్ సందర్శించటం జరిగింది..రాజకీయాల్లోకి వచ్చి పట్టుమని పదేళ్ళు అయినా కాకమునుపే 2008 లో టికెట్ రాని కారణంగా ఎం ఐ ఎం నుంచి పీ పీ పీ లోకి దూకేసి టికెట్ సాధించి గెలిచిన తరువాత మంత్రి కూడా అయిపోయి సమకాలీన రాజకీయాల్ని పూర్తిగా వంటపట్టించేసుకున్న నెరజాణ.
భారత్ అధికారులను కలవటానికి ముందే కాశ్మీరీ వేర్పాటు వాదులను కలవటం ద్వార ప్రోటోకాల్ నిబందనలను ఉల్లంఘించినదని ప్రతిపక్ష భాజపా నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంది ఈమె.
ఇక ఎప్పుడు ఏ "పాకీ" వాడు మనదేశానికి వస్తున్నా దుమ్మెత్తి పోసే మన జాతీయ మీడియా ఆమె అందానికి ఫిదా అయిపోయింది...చర్చల విషయాన్ని పక్కన పెట్టి రబ్బాని వేసుకున్న జ్యుల్లరీ గురించి తాను పెట్టుకున్న చలువ కళ్ళద్దాల బ్రాండ్ గురించి చేతికి తగిలించుకున్న బాగ్ గురించి వర్ణిస్తూ ఎలా తరించిపోయిందో ఈ విడియో చూస్తే మీకే తెలుస్తుంది.

1 comment:

Anonymous said...

ఆమె అంత అందంగా ఏమీ లేదు. ఆడప్రాణి అంటే చాలు, చొంగలు కార్చుకుంటుంది ఈ మీడియా. అంతే