Wednesday, August 24, 2011

జగత్ "కిలాడి" రాజకీయం!!



అవినీతికి వ్యతిరేకంగా రాజీనామాలు చేయటం సాధారణం.... వినాశకాలే విపరీత బుద్ది అని ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేక పోగా తగుదునమ్మా అంటూ సిగ్గు విడిచి అవినీతికి అనుకూలంగా రాజీనామాలు చేయించటం అసాధారణమె కాదు అసహ్యకరం.... అతి జగుప్స్తాకరం!!!
అరే! వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అంటాడే కాని "నేను తినలేదు" అని ఒక్కమాటా అనడే.....అమ్మగారితో ప్రధానికి వ్రాయించిన లేఖ లో కూడా వైయ్యెస్ కి ఇచ్చే మర్యాద ఇదేనా అని వాపోయారే గాని మేము నిర్దోషులం అని చెప్పుకోలేక పోయారే.....అవునులే...దోషులమని వారి అంతరాత్మ పదే పదే ఘోషిస్తుంటే ఎలా అంటారు.

దాని పర్యవసానమే ఈ రోజు పై కోర్టు "విచారణపై" స్టే పిటీషన్ రెండోసారీ కొట్టివేయటం ద్వారా కర్రు కాల్చి వాత పెట్టి పంపించినట్లైంది...వీటికి తోడు హవాలా చట్టం ఉల్లంఘనలు బయటపడుతున్నాయి.....ధనయగ్నం లొసుగుల డొంకా కదులుతోంది.......అసలు ఒకటేమిటి....పాపం పండి నేరాల పుట్ట పగులుతోంది....
బస్సు యాత్రలు చేసి
సానుభూతి శునక వాలం పట్టుకుని
బురదగోదావరిని ఈదాలనుకోవటం వట్టి ప్రయాసే అని
శ్రీక్రిష్ణ జన్మస్తానానికి వెళ్ళాక కానీ భోధపడదేమో!!

No comments: